Pushpa 2 The Rule: పుష్ప 2: ది రూల్.. అల్లు అర్జున్ మాస్ రీఎంట్రీతో రికార్డులు బద్దలు

Pushpa 2 The Rule Review: పుష్ప రాజ్‌గా బాక్సాఫీసును అల్లు అర్జున్ షేక్ చేస్తున్నాడు. భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. పుష్ప 2 మూవీ మొదటి రోజే రూ.250 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2024, 01:25 PM IST
Pushpa 2 The Rule: పుష్ప 2: ది రూల్.. అల్లు అర్జున్ మాస్ రీఎంట్రీతో రికార్డులు బద్దలు

Pushpa 2 The Rule Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుష్ప రాజ్‌గా తిరిగి వచ్చాడు. బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు బద్దలు కొడుతూ.. భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నాడు. బ్లాక్‌బస్టర్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెబుతూ.. వైల్డ్ ఫైర్ రికార్డులతో పుష్ప-2 ది రూల్ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ ముందే రూ.1,000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ జరుపుకోగా.. 3 మిలియన్ అడ్వాన్స్‌ టిక్కెట్లను అమ్మడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.275 కోట్లకు కొనుగోలు చేయడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. సినిమా విడుదల తరువాత బ్లాక్‌బస్టర్ టాక్‌తో అన్ని అంచనాలను దాటుకుని.. ప్రేక్షకులకు మరింత అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది.

ఓపెనింగ్ డే దుమ్ము దులిపిన పుష్ప 2!

విడుదలైన మొదటి రోజే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకులను, విమర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. పట్నా నుంచి ముంబై వరకు ప్రతి థియేటర్‌లో పుష్ప మానియా నెలకొంది. ప్రతి షోలో ఆడియన్స్ కేరింతలు, చప్పట్లు మధ్య "పుష్ప జూకేగా నహీ!" అంటూ థియేటర్స్‌ను మోతెక్కిస్తున్నారు. 

యాక్షన్, ఎమోషన్, బ్రాండింగ్‌కి సమ్మిళితం

200 నిమిషాల ఈ అద్భుత సినిమా కేవలం రక్తికట్టించే యాక్షన్, భావోద్వేగ కథనే కాదు.. అదనంగా బ్రాండింగ్‌తో క్రేజ్ సొంతం చేసుకుంది. భారతదేశంలో అతిపెద్ద వుడ్ ప్రొడక్ట్స్ తయారీదారు సంస్థ గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్‌తో సినిమా సహకారం మూవీకి అదనపు హంగులు అందించింది. పుష్ప బలాన్ని, పట్టుదలని, అవిభాజ్యమైన సంకల్పాన్ని గ్రీన్‌ప్లై యొక్క "బలమూ, శాశ్వతత్వం" సిద్ధాంతంతో చక్కగా మిళితం చేసింది. ఈ సహకారం కేవలం సహజమైనదే కాకుండా.. మరింత ప్రభావవంతంగా అనిపిస్తుంది.

తీర్పు: అల్లు అర్జున్ సింహాసనాన్ని నిలబెట్టాడు

పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ తన కెరీర్‌లో అత్యుత్తమమైన నటనను కనబర్చాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తమ పాత్రల్లో మెరిశారు. చిత్ర కథనాన్ని, విజువల్స్‌ను మరింత బలంగా చేసింది. ఉత్కంఠభరిత యాక్షన్ సీక్వెన్స్‌ల నుంచి భావోద్వేగాన్నిచ్చే దృశ్యాల వరకు, పుష్ప 2 ఒక అద్భుతమైన అనుభవం.

సాంస్కృతిక సంచలనం

పుష్ప 2 కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది ఒక భావనగా మారింది. దేశవ్యాప్తంగా ప్రమోషనల్ క్యాంపెయిన్, పెద్ద పెద్ద ఫ్యాన్ ఈవెంట్స్, సిటీ టూర్లు ఈ సీక్వెల్‌ను ఒక చారిత్రక మైలురాయిగా మార్చాయి. అద్భుతమైన కథ, మరపురాని డైలాగులు, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లతో ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో 'బాక్సాఫీస్ కింగ్' స్థాయిని సంపాదించుకుంది.

తప్పక చూడండి!

ఇంకా పుష్ప 2: ది రూల్ చూడకపోతే ఇంకేందుకు ఆలస్యం..? కచ్చితంగా థియేటర్‌కు వెళ్లి ఆస్వాదించండి, ఆ ఎనర్జీని ఫీల్ చేయండి, ఈ సినీ విప్లవంలో భాగం అవ్వండి.

మా సమీక్ష, విశ్లేషణ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి:

 

Trending News