OMG 2 Remake: తెలుగులో రీమేక్‌ కానున్న అక్షయ్ ‘ఓ మై గాడ్‌2’.. హీరో అతడేనా?

OMG 2 Movie: అక్షయ్ కుమార్ నయా సూపర్ హిట్ 'ఓ మై గాడ్ 2' మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కులను ఓ బడా నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్లు టాక్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 10:29 PM IST
OMG 2 Remake:  తెలుగులో రీమేక్‌ కానున్న అక్షయ్ ‘ఓ మై గాడ్‌2’.. హీరో అతడేనా?

OMG 2 Remake In Telugu:  మన చిత్రాలు తరచూ హిందీలో రీమేక్ అవుతుంటాయి. అయితే తాజాగా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్‌ 2’ మూవీ ఇప్పుడు తెలుగులోకి రీమేక్ కానుంది. ఓ మై గాడ్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 11న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. చిన్నారుల్లో లైంగిక విజ్ఞానం అనే సున్నిత కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రలో నటించి మెప్పించారు.

తాజాగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రీమేక్ హక్కులను ఓ బడా నిర్మాణ సంస్థ  దక్కించుకున్నట్లు సమాచారం. గతంలో ఓ మై గాడ్ సినిమాను తెలుగులో 'గోపాల గోపాల' పేరుతో  సినిమా రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేష్, పవన్ కల్యాణ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది టాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఓ మై గాడ్ 2 తెలుగు రీమేక్ లో ఓ టాప్ హీరో నటించనున్నాడని సమాచారం. అయితే ఈ మూవీలో శివుడి పాత్రలో వెంకీ నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఓమై గాడ్ 2 మూవీ ద్వారానే అక్షయ్ కుమార్ తిరిగి విజయాల బాట పట్టాడు. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొందరు ఈ మూవీ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేయాలంటూ డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్  అవుతోంది. 

Also Read: Vijay Deverakonda: సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ నయా మూవీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News