Lady constable suicide in annamayya district: దేశంలో ఎన్నికల ఫలితాల హైటెన్షన్ నెలకొంది. ఒకవైపు ఎన్నికల ఫలితాల కోసం అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా అధికారులు పటిష్టబందోబస్తును చేపట్టారు. ఇదిలా ఉండగా ఎన్నికలవేళ ఏపీలో జరిగిన అవాంచనీయ సంఘటలు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఏపీలో అనేక చోట్ల కేంద్ర భద్రాతా సిబ్బందితో సెక్యురిటీని నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఎన్నికల ఫలితాల సమయంలో ఎవరు కూడా ఇబ్బందులు క్రియేట్ చేయోద్దంటూ ఎస్పీలు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు గట్టిగా బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు.
Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..
ఇదిలా ఉండగా.. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఏపీలోని అన్నమయ్యజిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక లేడీకానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ కు పాల్పడింది. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాలు..
అన్నమయ్య జిల్లాలోని రాయచోటీలో అనుకోని ఘటన చోటుచేసుకుంది రాయచోటీ ఎస్పీ కార్యలయంలో విధులు నిర్వహిస్తున్న వేదవతి (28) తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దగా తుపాకీ పేలిన శబ్దం రావడంతో, చుట్టుపక్కల ఉన్న సిబ్బంది అక్కడికి వెళ్లారు. అప్పటికే లేడీ కానిస్టేబుల్ రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. చిత్తూరు జిల్లా పుంగనూరు కు చెందిన కానీస్టేబుల్ వేదవతికి,మదన పల్లెకు చెందిన దస్తగిరికి పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహాం. ఒక కూతురు ఉంది. అయితే.. దస్తగిరికి అప్పటికే ఒక పెళ్లి జరిగింది. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత వేదవతీ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
సదరు లేడీ కానిస్టేబుల్ చనిపోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కుటుంబ కలహాలు కారణామా..?... మరేఇతర కారణాలు ఉన్నాయా.. అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఎస్పీ ఆఫీసులో యువతి సూసైడ్ చేసుకొవడం మాత్రం తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter