Sahara Refund: సహారా డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఎక్కువ రిఫండ్ పొందవచ్చు

Sahara Refund: సహారా డిపాజిటర్ల రిఫండ్ లిమిట్ ను రూ. 10000 నుంచి రూ. 50000 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో డిపాజిటర్లు వేగంగా డిపాజిట్లను పొందే అవకాశం లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Sep 19, 2024, 08:25 PM IST
Sahara Refund: సహారా డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఎక్కువ రిఫండ్ పొందవచ్చు

Sahara Refund: సహారా గ్రూపులో డబ్బులు దాచుకొని చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిపాజిటర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇకపై సహారా గ్రూప్‌కు చెందిన సహకార సంఘాల చిన్న డిపాజిటర్ల విత్‌డ్రా  లిమిట్ ను రూ.10,000 నుంచి రూ.50,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిఆర్‌సిఎస్-సహారా రిటర్న్ పోర్టల్ ద్వారా సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.370 కోట్లను విడుదల చేసింది.

రిటర్న్ మొత్తం పరిమితిని రూ.50,000కి పెంచడం ద్వారా, రాబోయే 10 రోజుల్లో సుమారు రూ.1,000 కోట్లు పంపిణీ అవుతాయని అధికారులు తెలిపారు. రీఫండ్‌లను జారీ చేసే ముందు ప్రభుత్వం డిపాజిటర్ల క్లెయిమ్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, సహారా గ్రూప్‌లోని నాలుగు బహుళ-రాష్ట్ర సహకార సంఘాల డిపాజిటర్‌లకు డబ్బును తిరిగి ఇవ్వడానికి CRCS-సహారా రిటర్న్  పోర్టల్ జూలై 18, 2023న ప్రారంభించారు.

డబ్బులు రిటర్న్ అందిస్తున్న సంస్థలు ఇవే : సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లక్నో, సహారన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, భోపాల్; అవర్ ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్.

Also Read: Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్‎లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే?

మార్చి 29, 2023 నాటి సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, మే 19, 2023న SEBI-సహారా రీఫండ్ అకౌంట్ నుండి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (CRCS)కి రూ. 5,000 కోట్లు బదిలీ అయ్యాయి. డిజిటల్ పద్ధతిలో డిపాజిటర్లకు నిధుల పంపిణీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి ఆదేశానుసారం జరుగుతోంది. 

ఇదిలా ఉంటే 2009లో సహారా సంస్థ కుంభకోణం బయటపడింది. ఇందులో ప్రధానంగా సహారా రియాల్టీ విభాగం సహారా ప్రైమ్ సిటీ ఐపీఓ సందర్భంగా సెబికి సమర్పించిన దరఖాస్తు పత్రాల్లో సహారా గ్రూపు చేసిన మోసం బయటపడింది. మొత్తం 24 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు సెబి ఇందులో గుర్తించింది. డిపాజిటర్ల నుంచి డిబెంచర్ల రూపంలో అక్రమంగా సేకరించిన 20వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని రెండు సహారా సంస్థలను కోరుతూ 2012లో భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించగా 2017 లో ఈ మొత్తాన్ని 25,700 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సంస్థ అధినేత సుభ్రత రాయ్ జైలు జీవితం సైతం గడిపారు. కాగా 2020 సంవత్సరంలో సహారా గ్రూప్ సెబీ - సహారా  రిఫండ్ పేరిట ఒక ఖాతాను ప్రారంభించి అందులో 15,448 కోట్లు జమ చేశారు. మొత్తం 14,146 మంది దరఖాస్తుదారులకు ఇప్పటివరకు రిఫండ్ చేయగలిగామని అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో తెలిపారు.

Also Read: SSY: సుకన్య సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట 50 లక్షలు పొందాలంటే ఏం చేయాలి?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News