LIC Offer: ప్రీమియం చెల్లించక ఆగిపోయిన పాత పాలసీలు తెర్చుకునే అవకాశం, భారీ డిస్కౌంట్ కూడా

LIC Offer: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు శుభవార్త. నష్టం కలగకుండా ఉండేందుకు ఎల్ఐసీ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. కొన్నేళ్ల నుంచి ప్రీమియం చెల్లించకుండా వదిలేసిన పాలసీలను తిరిగి ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 21, 2022, 04:56 PM IST
LIC Offer: ప్రీమియం చెల్లించక ఆగిపోయిన పాత పాలసీలు తెర్చుకునే అవకాశం, భారీ డిస్కౌంట్ కూడా

LIC Offer: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు శుభవార్త. నష్టం కలగకుండా ఉండేందుకు ఎల్ఐసీ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. కొన్నేళ్ల నుంచి ప్రీమియం చెల్లించకుండా వదిలేసిన పాలసీలను తిరిగి ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. 

చాలామంది ఎల్ఐసీ పాలసీను కొనుగోలు చేసి..కొన్ని నెలలో, సంవత్సరాలో చెల్లించి తరువాత వదిలేస్తుంటారు. ఫలితంగా ఆ పాలసీ ల్యాప్స్ అవడమో లేదా క్లోజ్ అయిపోవడమో జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పాలసీ హోల్డర్లకు అప్పటివరకూ చెల్లించిన డబ్బులు కూడా తిరిగి రావు. ఫలితంగా పాలసీ హోల్డర్లకు నష్టం కలుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఎల్ఐసీ మంచి అవకాశం కల్పిస్తోంది. అలా ఆగిపోయిన పాలసీల్ని తిరిగి ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్‌తో క్లోజ్ అయిన పాలసీను తిరిగి ప్రారంభించే అవకాశమిది. 

ఎల్ఐసీలోని ULIP ప్లాన్ తప్పించి మిగిలిన అన్ని ఎల్ఐసీ పాలసీలను లేట్ ఫీజు చెల్లించి ప్రారంభించవచ్చు. ఈ అపరాధ రుసుముపై ఇప్పుడు ఎల్ఐసీ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆధారిత లేట్ ఫీజు ఆఫర్ ఆగస్టు 17, 2022 నుంచి అక్టోబర్ 21, 2022 వరకూ ఉంటుంది. 

ఎల్ఐసీ పాలసీలను తిరిగి ప్రారంభించాలంటే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎల్ఐసీ ఈ ఆఫర్ సమయంలో సూక్ష్మ భీమా పాలసీలపై 100 శాతం ఫీజు మినహాయింపు ఇస్తోంది. అయితే ULIP ప్లాన్ కు మాత్రం ఎల్ఐసీ ఈ మినహాయింపు ఇవ్వడం లేదు. మిగిలిన అన్ని పాలసీలకు డిస్కౌంట్ వర్తిస్తుంది. అయితే ఇందులో కొన్ని నిబంధనలున్నాయి. కనీసం ఐదేళ్ల క్రితం ప్రీమియం చెల్లించిన పాలసీలనే పునరుద్ధరించే అవకాశముంటుంది. 

ఏదో ఒక కారణంతో ప్రీమియం చెల్లించలేక పాలసీలను నిలిపేసినవారికి ప్రయోజనం కల్పించేందుకు ఎల్ఐసీ ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. ఎల్ఐసీ ప్రకటన ప్రకారం పాలసీ ప్రీమియం 1 లక్ష లేదా అంతకంటే తక్కువైతే లేట్ ఫీజులో 25 శాతం డిస్కౌంట్ ఉంటుంది. అంటే అత్యధికంగా 2500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ ప్రీమియం 1-3 లక్షల మధ్యలో ఉంటే 3 వేల రూపాయలు డిస్కౌంట్ నిర్ధారించారు. పాలసీ ప్రీమియం 3 లక్షల కంటే ఎక్కువైతే 3500 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. 

Also read: Flipkart Offer: ముందు షాపింగ్ చేయండి.. నెల తర్వాత డబ్బులు చెల్లించండి.. ఫ్లిప్‌కార్ట్ లో 'పే ల్యాటర్‌' ఆప్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News