Income Tax Filing Online: ట్యాక్స్ పేయర్లకు ముఖ్యగమనిక. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు సమయం ముంచుకోస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం చాలా అవసరం. ఐటీర్ ఫైల్ చేసే సమయంలో కామన్ మిస్టేక్స్ గురించి తప్పకుండా తెలుసుకోండి.
ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31వ తేదీ వరకు సమయం ఉండగా.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 12 రోజుల ముందే కోటి రూపాయలకు చేరుకుందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది. ట్యాక్స్ పేయర్లు ఆఖరి క్షణం వరకు వేచి ఉండకుండా.. సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. ఆదాయ పన్ను వివరాలు అందజేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయకుండా.. జాగ్రత్తగా ఫైల్ చేయాలని చెబుతున్నారు.
గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ప్రభుత్వం గడువు పొడగిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఉపయోగించి ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్‌ను ముందుగా వెరిఫై చేసుకోవాలి. లేకపోత ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెట్ బకాయి ఉన్న ఆదాయపు పన్ను రీఫండ్‌ను క్రెడిట్ చేయదు.
ఆదాయ పన్ను రిటర్న్స్ అనేది ఒక వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సమర్పించాల్సిన ఫారమ్. ఒక ఏడాదిలో ఒక వ్యక్తి చెల్లించాల్సిన ట్యాక్స్‌ల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఐటీఆర్‌లో నమోదు చేసిన సమాచారం నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిది ఉండాలి. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై.. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసే ఉండాలి. మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.
Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన
Also Read: Nagarjuna New Car: కొత్త కారు కొనుగోలు చేసిన నాగార్జున.. ధర ఎంతో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి