New EPF Rules: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. మరో రెండు మరో మూడు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రానుంది. దీనితో.. కొత్త రూల్స్ కూడా అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ముఖ్యంగా పీఎఫ్ ఖాతాలో అధికంగా జమ చేసేవారిపై పన్ను విధించి ఉద్దేశంతో ఈ మార్పులను తీసుకురానుంది ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్పులను నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పీఎఫ్ ఖాతాలను రెండుగా విభజింజనుంది. అందులో ఒకటి పన్ను వర్తించేది కాగా.. రెండోది పన్ను మినహాయింపు ఉండేది.
కొత్త నిబంధనల గురించి వివరంగా..
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ ఖాతాలు.. ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ అనే క్యాటగిరీలుగా విడిపోతున్నాయి.
- 2021 మార్చి 31 నాటికి క్లోజ్ అయిన అకౌంట్లకు కూడా ఈ నింబంధనలను వర్తిస్తాయని కూడా ప్రభుత్వం పేర్కొంది.
- కొత్త నిబందనల ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల కన్నా ఎక్కువగా.. ఉద్యోగి వాటా జమ అయితే వారు ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- అంటే.. భారీగా ఆదాయం గడించే వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అదనపు పన్ను భారం పడనుంది.
- ఇక పన్ను పరిధిలోకి వచ్చే ఖాతాదారులకు.. ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలు కూడా నిలిచిపోనున్నాయి. తక్కువ ఆదాయం వచ్చే వారికి సహాయం చేసేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- ఈ కొత్త నిబంధనల ద్వారా సులభంగా.. పన్ను పరిధిలోకి వచ్చే వారిని గుర్తించొచ్చని కేంద్రం గతంలో పేర్కొంది.
Also read: Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు ఎంత? ఏ రాష్ట్రంలో అత్యధికం?
Also read: iPhone 14: విడుదలకు ముందే యాపిల్ ఐఫోన్ 14 ఫీచర్లు లీక్- 48 ఎంపీ కెమెరాతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook