EPF Account: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా..ఉంటే ఇ నామినేషన్ ఫైల్ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఆ ఒక్క దరఖాస్తు ఫైల్ చేస్తే 7 లక్షల వరకూ ప్రయోజనం కలగనుంది. అదెలాగో పరిశీలిద్దాం..
ఈపీఎఫ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ ఫాలో అవడం చాలా అవసరం. అటువంటిదే ఒక అప్డేట్ చాలా రోజుల్నించి తిరుగుతోంది. కానీ చాలామంది పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మీ ఈపీఎఫ్ ఎక్కౌంట్లో ఇ నామినేషన్ ఫైల్ చేయాలనేది ఆ అప్డేట్. ఇది అవసరమే కాదు..ప్రయోజనకరం కూడా. అది ఫైల్ చేస్తే 7 లక్షల వరకూ ప్రయోజనం కలుగుతుంది. ఆశ్చర్యంగా ఉన్నా..ఇది నిజమే. ఎందుకంటే ఈపీఎఫ్‌లో డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగి కుటుంబానికి 7 లక్షల రూపాయలు లాభం చేకూరుతుంది. పీఎఫ్ ఎక్కౌంట్ కొనసాగుతున్న క్రమంలో ఆ ఉద్యోగి మరణిస్తే..కుటుంబసభ్యులకు 7 లక్షల రూపాయల భీమా అందుతుంది. అయితే ఈ స్కీమ్‌లో చేరాలన్నా లేదా ఈ ప్రయోజనాన్ని పొందాలన్నా ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్‌లో చేరాలంటే సంబంధిత ఉద్యోగులు ఇ నామినేషన్ పైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాల్ని ఈపీఎఫ్ అక్కౌంట్లో నమోదు చేయాలి. ఆన్లైన్లోనే నామినీ వివరాల్ని ఎంటర్ చేయవచ్చు. ఇ నామినేషన్ ద్వారా సులభంగా చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులంతా ఇ నామినేషన్ ఫైల్ చేసి కుటుంబసభ్యులకు సామాజిక భద్రత కల్పించాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది.
ముందుగా ఈపీఎఫ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. తరువాత సర్వీస్ పై క్లిక్ చేయాలి ఇందులో ఫర్ ఎంప్లాయిస్ సెక్షన్ క్లిక్ చేస్తే.. Member UAN/Online Service ఆప్షన్ తెర్చుకుంటుంది. మెంబర్ ఈ సేవా పోర్టల్ ఓపెన్ అయిన తరువాత ఉద్యోగులు యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత manage ట్యాబ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో E Nomination సెలెక్ట్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేసిన తరవాత నామినీగా ఎవర్ని ఎంచుకుంటే వారి వివరాల్ని నమోదు చేయాలి. Add Family Detailsపై క్లిక్ చేసి వివరాలన్నీ సమర్పించాలి.
ఒకరు లేదా ఎక్కువ మంది పేర్లు ఇవ్వవచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా చెప్పవచ్చు. చివరిగా వివరాల్ని సరిచూసుకున్న తరువాత Save EPF Nominationపై క్లిక్ చేయాలి. ఆ తరువాత పేజీలో E Sign ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వన్‌టైమ్ OTP వస్తుంది. ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇదే స్కీమ్‌లో 2 లక్షల నుంచి 6 లక్షల వరకూ భీమా ఉండేది. ఇప్పుడు ఈపీఎఫ్ కనీసం 2 లక్షల 50 వేల రూపాయలు..గరిష్టంగా 7 లక్షల రూపాయలు అందిస్తోంది.
Also read: Post Office Schemes: రిస్క్ లేని పెట్టుబడులు, అద్భుత లాభాలు, టాప్ 5 స్కీమ్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook