Dhanathrayodasi 2024: ఈ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన ధన త్రయోదశి పండుగ అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరుపుకొనున్నారు. ధన త్రయోదశి పండుగను ధంతేరస్ అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినాన బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా జనం ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ధన త్రయోదశి రోజు మీరు బంగారం కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే వెంటనే ఇక్కడ పేర్కొన్న కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చు. తద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా బంగారం ధర భారీగా పెరిగినప్పుడు వాటిని అభరణాలను కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది.
ప్రస్తుతం బంగారం ధర 81 వేల రూపాయలు దాటింది. ఈ నేపథ్యంలో మీరు బంగారం కొనుగోలు చేయాలంటే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం పెరిగిన నేపథ్యంలో ఒక తులం గొలుసు కొనుగోలు చేయాలన్న అందులో వేస్టేజీ, జిఎస్టి, అలాగే ఇతర మేకింగ్ చార్జీలు అన్నీ కలిపి 90 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు కోసం ఎంత ఎత్తున ఖర్చు పెట్టాలో అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉంటే బంగారం కొనుగోలు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దాని క్వాలిటీ విషయంలోనూ బరువు విషయంలోనూ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఇదిలా ఉంటే మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోయినా పర్లేదు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ బంగారం కొనుగోలుకు కేవలం 100 రూపాయలు ఉన్న సరిపోతుంది మీరు ఎంచక్కా అందుకు సరిపడా బంగారం మీ ఖాతాలో వేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Business Ideas: మీ ఊరికి మీరే పుష్ప రాజ్.. ఎకరం భూమి ఉంటే చాలు.. కోట్ల రూపాయలు మీ సొంతం
ప్రస్తుతం పలు డిజిటల్ పేమెంట్ యాప్స్ డిజిటల్ గోల్డ్ ను విక్రయిస్తున్నాయి. వీటిలో మీరు ఒక రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీరు వంద రూపాయలు పెట్టి ఇందులో బంగారం కొనుగోలు చేసినట్లయితే మీ పేరిట ఒక డిజిటల్ వాలెట్ క్రియేట్ అవుతుంది. స
అందులో 100 రూపాయలకు సరిపడా బంగారం జమ చేస్తారు. అయితే ఇందులో బంగారం డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటుంది. వీటిని మీరు అర గ్రాము నుంచి హోం డెలివరీ పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి