365 Days Cheapest Plan: ప్రతినెల రీఛార్జ్ ప్లాన్లతో సతమతం అవుతుంటారు యూజర్లు. ఎందుకంటే ధరలు చూస్తే అలా ఉన్నాయి. ఇలా కాకుండా ఏడాది పాటు వర్తించే బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు వరంలా మారుతున్నాయి. ఈ ప్లాన్స్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ఎలాంటి ఖర్చులు లేకుండా అపరిమితంగా ఇంటర్నెట్ డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం పొందుతారు.
ఈరోజు ఏ టెలికాం కంపెనీలు అతి తక్కువ ధరలోనే ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ ను మన ముందుకు తీసుకువచ్చాయి తెలుసుకుందాం.. ఇందులో హై స్పీడ్ డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందుతారు. ఇందులో మీకు ఏ ప్లాన్ మీకు వర్తిస్తుందో తెలుసుకుందాం
విఐ రూ. 1849 ప్లాన్..
వోడాఫోన్ అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల పాటు వర్తిస్తుంది. ఈ ప్లాన్ లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అపరిమితంగా వాయిస్ కాలింగ్ నెట్వర్క్ అయిన పొందుతారు. 3600 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు. అయితే ఈ ప్లాన్ లో మాత్రం ఇంటర్నెట్ డేటా సౌకర్యం లేదు. వోడాఫోన్ వినియోగిస్తున్న వారికి ఇది ఏడాది పాటు వర్తిస్తుంది. కేవలం ఫోన్ కాలింగ్ మాత్రమే ఉపయోగించేవారికి ఇది సరిపోతుంది. ఇంటర్నెట్ డేటా ఉపయోగించాలంటే టాప్ అప్ చేసుకోవాల్సిందే. ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇది బెస్ట్.
ఇదీ చదవండి: Rose Water: ఈ నీరు ఉంటే చాలు.. ఏ ఫేస్ క్రీముల అవసరం ఉండదు..
జియో రూ. 3599 ప్లాన్..
ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఆయన జియో కూడా 365 రోజుల వాలిడిటీ ప్లాను తీసుకువచ్చింది. ఇది కూడా బడ్జెట్లో అందుబాటులో ఉంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు.. ఇది కాకుండా 2.5 జిబి డేటా ప్రతిరోజు పొందుతారు. 100 ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్లాన్‌లో ఉంటుంది. మీ ఏరియాలో 5జి ఉంటే 5జి హై స్పీడ్ లో ఇంటర్నెట్ వస్తుంది. ఇది కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఫ్రీ యాక్సెస్ కూడా మీ సొంతం.
ఇదీ చదవండి: పసుపును ఇలా నీళ్లలో కలిపి తీసుకుంటే.. ఒంట్లో ఉన్న చెడుకొవ్వు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.
బిఎస్ఎన్ఎల్ రూ.1999 ప్లాన్..
ప్రభుత్వ టెలికాం రంగ కంపెనీ అయినా బిఎస్ఎన్ఎల్ కేవలం రూ.1999 మాత్రమే ఈ ఏడాదిపాటి వాలిడిటీ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్లాన్ లో కూడా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా పొందుతారు.. ఇది కాకుండా 600 జిబి డేటా కూడా పొందుతారు. హై స్పీడ్ డేటా అందుకుంటారు.. ప్రభుత్వ రంగ కంపెనీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ప్రతి రోజు మీకు అందిస్తుంది. అయితే ఈ టెలికాం రీఛార్జ్ ప్యాక్ లో ఇతర బెనిఫిట్స్ ఏమి ఉండవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.