Ys jagan vs Ys Sharmila: జగన్‌పై మరో బాంబు పేల్చిన షర్మిల, సీబీఐ ఛార్జిషీటులో వైఎస్ఆర్ పేరు చేర్చింది జగనే

Ys jagan vs Ys Sharmila: వైఎస్ జగన్ అంటే తనకు ప్రాణమని ప్రమాణం చేస్తున్నానంటూ వైఎస్ షర్మిల తెలిపారు. ఆస్థి పంపకాల వివాదం అనంతరం అన్నాచెల్లెళ్ల వ్యవహారం సంచలనంగా మారింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 26, 2024, 05:51 PM IST
Ys jagan vs Ys Sharmila: జగన్‌పై మరో బాంబు పేల్చిన షర్మిల, సీబీఐ ఛార్జిషీటులో వైఎస్ఆర్ పేరు చేర్చింది జగనే

Ys jagan vs Ys Sharmila: ఆస్థి పంపకాల వ్యవహారంపై వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. తన సోదరునితో తలెత్తినత ఆస్థి సమస్యపై సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడాతున్నారంటూ మండిపడిన వైఎస్ షర్మిల..సుబ్బారెడ్డి జగన్ మోచేతీ నీళ్లు తాగేవాడంటూ సంచలనం రేపారు. ఇవాళ సుబ్బారెడ్డి...రేపు విజయసాయి రెడ్డి సైతం మాట్లాడుతారన్నారు. 

వైఎస్ఆర్ బతికున్నప్పుడు భారతి సిమెంట్స్ పరిశ్రమలో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఇవ్వాలని చెప్పారని...ఈ విషయంలో తాను ప్రమాణం చేస్తున్నానన్నారు. సుబ్బారెడ్డి కూడా తాను చెబుతున్న నిజమని ప్రమాణం చేస్తారా అని నిలదీశారు. ఈ లోకంలో నీ తరువాత పాప అంటే తన మేలు కోరేది నేనే అంటూ జగన్ తన తండ్రి వైఎస్ఆర్‌కు మాటిచ్చారని గుర్తు చేశారు. ఆ మాట ఇప్పుడు ఏమైందని వైఎస్ షర్మిల అడిగారు. భారతి సిమెంట్స్, సాక్షి అనేవి కుటుంబ ఆస్థులైతే సొంతంగా జగన్ స్థాపించాడంటూ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారి పేర్లతో ఆస్థులున్నంత మాత్రాన ఆ ఆస్థి వారిదవుతుందా అని ప్రశ్నించారు. తనకిచ్చిన 40 శాతం వాటా గిఫ్ట్ కాదని, తన హక్కు అని షర్మిల స్పష్టం చేశారు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనంలో లేకపోయినా సరస్వతి పవర్ షేర్లను బదిలీ చేసే విషయంలో ఎందుకు మాట నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. వాస్తవాలు తెలిసి కూడా ఇంత సునాయసంగా ఎలా మాట్లాడగలుగుతున్నారంటూ సుబ్బారెడ్డిపై ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించినప్పుడు  తాను, తన తల్లితో పాటు ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేశామన్నారు. మోకాలి నొప్పులున్నా భరిస్తూ తన తల్లి పార్టీ కోసం కష్టపడిందన్నారు. తన అన్నంటే తనకు ప్రాణమని అందుకే తన కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. అసలు పార్టీకు తానేం అన్యాయం చేశానని ప్రశ్నించారు. 

వైఎస్ఆర్ మరణానంతరం ఆయన పేరును సీబీఐ ఛార్జిషీటులో పెట్టించింది జగన్ కాదా అంటూ మరో బాంబు పేల్చారు. తన లబ్ది కోసం తల్లిదండ్రుల్ని వాడుకోలేదా అని నిలదీశారు. సొంత కొడుకే తల్లిని కోర్టుకు ఈడ్చిన పరిస్థితి అని ఆవేదన చెందారు. 

Also read: Electricity Charges: డిసెంబర్ నుంచి ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News