జనసేన కు కింగ్ మేకర్ ఛాన్స్ దక్కేనా  ?

ఏపీ ప్రభుత్వ ఏర్పాటులో జససేన పార్టీ కిలక పాత్ర పోషించే అవకాశం వస్తుందా ? అనే దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది

Last Updated : Apr 12, 2019, 07:53 PM IST
జనసేన కు కింగ్ మేకర్ ఛాన్స్ దక్కేనా  ?

ఎన్నికల ఫలితాలు రాకపోవడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు ఏకపక్షంలో వస్తాయని ప్రచారం చేసుకుంటున్నాయి. మొత్తం 175 స్థానాల్లో 130కి తగ్గకుండా సీట్లు వస్తాయని టీడీపీ శ్రేణులు చెబుతుంటే..తమకు 140 సీట్లు ఖాయమని వైసీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు

ప్రధాని పార్టీల వాదన అటుంచితే... రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వేరేలా ఉంది. ఎన్నికల సరళిని బట్టి చూస్తే టీడీపీ - వైసీపీ మధ్య టఫ్ ఫైట్ నడిచినట్లు చెబుతున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చిన స్వల్ప మెజార్టీతో బయటపడే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అది సాధ్యం కానీ పక్షంలో మెజార్టీకి దగ్గరగా నిలిచే అవకాశముందంటున్నారు.

ఇక  జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి అధికారం చేపట్టే స్థాయిలో లేకపోయినా  8 నుంచి 10 స్థానాలకు తగ్గవనే  అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి. టీడీపీ - వైసీపీల్లో ఎవరికీ మెజార్టీ రాని పక్షంలో జనసేన కీలక భూమిక పోషించనుంది. కింగ్ మేరకు గా అవతరించే అవకాశం ఏర్పడుతుంది. ఇదే జరిగితే అధికారాన్ని ఎవరికి అప్పగించాలనేది జనసేన డిసైడ్ చేస్తుందన్న మాట.

Trending News