Vizag Blast: విశాఖపట్నంలో టిఫిన్ సెంటర్ వద్ద పేలుడు.. ఉలిక్కిపడ్డ స్థానికులు...

Vizag Gajuwaka Blast: విశాఖపట్నంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి టిఫిన్ సెంటర్ సామాగ్రితో పాటు గోడలు ధ్వంసమయ్యాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 18, 2022, 12:54 PM IST
  • విశాఖపట్నంలో భారీ పేలుడు
  • టిఫిన్ సెంటర్‌లో పేలుడు ఘటన
  • టిఫిన్ సెంటర్ సామాగ్రి, ప్రహారీ గోడ ధ్వంసం
 Vizag Blast: విశాఖపట్నంలో టిఫిన్ సెంటర్ వద్ద పేలుడు.. ఉలిక్కిపడ్డ స్థానికులు...

Vizag Gajuwaka Blast: విశాఖపట్నంలో పేలుడు ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గాజువాక పరిధిలోని ఆటోనగర్‌లో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి టిఫిన్ సెంటర్‌లోని సామాగ్రి, ప్రహారీ గోడ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. భారీ శబ్ధం విని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

పేలుడు ఘటనపై టిఫిన్ సెంటర్ యజమానితో మాట్లాడి పోలీసులు వివరాలు సేకరించారు. భారీ శబ్ధం విని గ్యాస్ సిలిండర్ పేలినట్లుగా భావించామని స్థానికులు తెలిపారు. కానీ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇదే విశాఖపట్నంలో నడిరోడ్డుపై ఓ రౌడీ షీటర్ దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఎంవీపీ కాలనీలో అనిల్ కుమార్ అనే రౌడీ షీటర్‌ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ప్లాన్ ప్రకారం అనిల్ కుమార్‌ను ఒక బార్‌కు పిలిపించి మద్యం తాగాక హత్య చేసినట్లు తెలుస్తోంది. శ్యామ్ ప్రకాష్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Also Read: నేడే భారత్, జింబాబ్వే తొలి వన్డే.. లైవ్‌ స్ట్రీమింగ్, టైమింగ్ డీటెయిల్స్ ఇవే!

Also Read: టాలీవుడ్లో విషాదం.. మొదటి సినిమా రిలీజవ్వకుండానే మ్యూజిక్ డైరెక్టర్ మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News