Pawan Kalyan-Nagababu : పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తనలోని అసలైన రాజకీయ నాయకున్ని పరిచయం చేస్తున్నారు. ఇన్నాళ్లు పవన్ సినీ గ్లామర్ తో రాజకీయాలను నెట్టుకొస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ పవన్ లోని అసలు సిసలైన రాజకీయ నాయకుడు ఉన్నారని స్పష్టం అయ్యింది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి జత కట్టడం నుంచి గెలుపు వరకు అంతా పవన్ భుజాల మీద వేసుకొని నడిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందంటే అది పవన్ చలవే అని అంందరికీ తెలిసిందే.అలాంటి పవన్ ఎన్నికల సమయంలో చాలా సంఘర్షణకు కూడా గురయ్యారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత మనుషుల నుంచి కూడా సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాడు. ఐనా పవన్ లో మాత్రం ఆత్మ విశ్వాసం తగ్గలేదు. తాను ఏదైతే అనుకున్నాడో అది చేసి చూపించాడు. దానికి మొన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాది నుంచి ప్రధానీ మోదీ, అమిత్ షాలతో అత్యంత సన్నిహితంగా నేతల్లో పవన్ ఒకరుగా ఉన్నారు.ఎన్డీయేలో బీజేపీకీ అతి నమ్మకమైన మిత్ర పక్షంగా జనసేన మారింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు కూడా మోదీ , అమిత్ షా ద్వయం అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తుంటే ఆ విషయం స్పష్టం అవుతుంది. గత పది హేను రోజుల వ్యవధిలోనే పవన్ మోదీ, అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కావడం దీనిని తెలుపుతుంది. కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కేంద్రం మంత్రులు పవన్ కు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. పవన్ వినతులను వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రులకు ఏకంగా ప్రధాని కార్యాలయం నుంచే సందేశాలు వెళ్లాయంటే పవన్ ఢిల్లీలో ఎంత పవర్ ఫుల్ గా మారారో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి తరుణంలో మరొక అంశం రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ సోదరుడు నాగబాబును రాజ్యసభకు నామినేట్ చేసే విషయంలో పవన్ ,బీజేపీ మధ్య చర్చలు జరిగినట్లు ఢిల్లీలో టాక్ నడుస్తుంది. మొదటి నుంచి జనసేనలో నాగబాబు యాక్టివ్ రోల్ లో ఉన్నారు. పవన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి ఉన్న కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అది సాధ్యపడలేదు. అటు తర్వాత ఏపీలో కీలక నామినేట్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. కానీ తాజాగా నాగబాబు విషయంలో రాజ్యసభ సభ్యునిగా పంపాలని బీజేపీ, పవన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఐతే నాగబాబునే రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకోవడానికి రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఒకటి మాత్రం ఆసక్తిగా ఉంది. జనసేన తరుపున ఢిల్లీలో పవన్ తరుపున ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుంది అని బీజేపీ పెద్దలు ప్రపోజల్ పెట్టారట. ప్రతినిధిగా పవన్ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు ఐన వ్యక్తి ఉంటే బాగుంటుందని బీజేపీ సూచన చేసిందంట. ఆ ప్రతినిధితో బీజేపీ తన సందేశాలను పవన్ కు పంపించాలని ఉద్దేశమట. దీంతో నాగబాబు పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా ఇస్తే నిత్యం ఢిల్లీలో అందుబాటులో ఉంటారని వారి ఆలోచనట. అంతే కాదు ఇప్పటి వరకు జనసేన తరుపున కేంద్ర మంత్రి వర్గంలో చోటు లేదు. నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే అది కూడా పూర్తి చేసినట్లు అవుతుందని బీజేపీ పవన్ కు సలహా ఇచ్చిందంట. దీనిపైనే పవన్ తో గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారని టాక్.
ప్రస్తుతం ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం నాగబాబుకు కేటాయిస్తారని ఏపీలో తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపై చర్చించడానికే పవన్ ఢిల్లీ వెళ్లారని ఏపీ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter