Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..

Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Oct 14, 2024, 04:34 PM IST
  • పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పవన్..
  • టాలీవుడ్ నటులపై పొగడ్తలు..
Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే  షాక్ అవుతారు..వీడియో వైరల్..

Pawan kalyan comments on Tollywood heroes: కొన్నిరోజులుగా మెగా ఫాన్స్ కి , అల్లు ఫ్యాన్స్ కు మధ్య రచ్చ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు. ఏపీలో ఎప్పుడైతే.. ఎన్నికల వేళ అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లారో.. అది కాస్త పీక్స్ కు చేరింది. అప్పటి నుంచి కూడా ఒక వైపు రాజకీయాల్లోనే కాకుండా.. మూవీ ఇండస్ట్రీలో కూడా మెగా వర్సెస్ అల్లు లాగా మారిందని చెప్పుకొవచ్చు.

 

ఈ నేపథ్యంలో  పవన్ కళ్యాన్ కూడా పలు సందర్భాలలో గతంలో హీరోలు అడవులు కొన్నిసందర్బాలలో అడవులు కాపాడే పాత్రలు వేసేవారని , కానీ అడవుల ఉత్పత్తుల్ని ఏ విధంగా చోరీ చేయాలో కొంత మంది హీరోలు చూపిస్తున్నారని పుష్పా మూవీ మీద ఇన్ డైరెక్ట్ గా సెటైర్ లు వేశారని కొంత మంది అంటున్నారు. మరొవైపు అల్లు అర్జున్ కూడా..తనకు నచ్చితే.. మనస్సుకు నిజంగా నచ్చితే.. అభిమానుల కోసం ఎంతదూరమైన వెళ్తానని కూడా  అల్లు అర్జున్ కౌంటర్ పవన్ కు కౌంటర్ ఇచ్చినట్లు  సొషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

 ఇదిలా ఉండగా..  తాజాగా, పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడులోనినిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. పవన్ కళ్యాన్ మాట్లాడుతూ. ఇన్నిరోజులు అభిమానులు.. ఓజీ .. ఓజీ అంటుంటే..తనకు మోదీ అని విన్పించేదన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరి కడుపు నిండడం ముఖ్యమన్నారు. అందుకు.. మన చుట్టుపక్కల రోడ్లు, స్కూల్స్ లను బాగు చేసుకుందామన్నారు.

మన అభిమాన నటీ, నటుల సినిమాలకు వెళ్లాలన్న కూడా... రోడ్లు బాగుండాలని కదా అని అన్నారు. అంతే కాకుండా.. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడారు. ప్రతి ఒక్క హీరో కూడా.. తనదైన స్టైల్ లో రాణిస్తున్నారన్నారు. సినిమాల పరంగా తనకు ఎవరితో ఇబ్బంది లేదన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొ విషయంలో ఎక్స్ పర్ట్ అన్నారు. బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా.. వీరంతా ఒక్కొ దాంట్లో ఎక్స్ పర్ట్ అంటూ కొనియాడారు.

Read more: Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..

హీరోలందరూ బాగుండాలని కోరుకునేవాడినని అన్నారు. మీ అభిమాన హీరోలకు జై కొట్టాలంటే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందుకే ఆర్థిక వ్యవస్థపై ముందు దృష్టి పెడదాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే.. పవన్ నోట అల్లు అర్జున్ పేరు రాగానే అక్కడ కార్యకర్తలు బిగ్గరగా అరిచినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా.. అని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News