ఏపీలో ఖాళీఅయిన లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నిక లేదు: ఓపీ రావత్

ఏపీలో ఉప ఎన్నికలపై స్పందించిన ఎన్నికల సంఘం

Last Updated : Oct 7, 2018, 10:05 AM IST
ఏపీలో ఖాళీఅయిన లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నిక లేదు: ఓపీ రావత్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలను ఉప ఎన్నికల లేదన్నారు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓపీ రావత్ మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొందని.. అందుకే మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ వెల్లడించారు.

ఏపీలో ఉపఎన్నిక అవసరం లేదు

ఈ సందర్భంగా రావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలపై స్పందించారు.  'జూన్ 4, 2018న ఆంధ్రప్రదేశ్ (వైకాపా) ఎంపీల రాజీనామాలను ఆమోదించారు. ప్రస్తుత లోక్‌సభ జూన్ 3, 2019న ముగుస్తుంది. ఏడాదికి కన్నా ఇంకా తక్కువ సమయమే ఉంది. ఏడాదిలోపు గడువు ఉన్న స్థానాలకు ఉపఎన్నికల అవసరం లేదు.' అని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ వైకాపా ఎంపీల రాజీనామాపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఐదుగురు వైకాపా ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. !

అటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశాలు, తుఫాను సంభవించే అవకాశం ఉన్నందున ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) కోరినట్లు.. ఎన్నికల తేదీలను ప్రకటించవద్దని లేఖ రాసినట్లు సీఈసీ ఓపీ రావత్‌ చెప్పారు.

 

Trending News