AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. వ్యాక్సినేషన్, సంక్షేమ పథకాల అమలుతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న క్రెడిట్ దక్కించుకుంది. నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం (Ap government)ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. అటు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పేరుతో రికార్డు సృష్టించింది. ఈ రెండింటితో పాటు మరో ఘనత సాధించింది. కరోనా సంక్షోభ సమయంలో సైతం సంక్షేమ పథకాల్ని విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే. లక్షలాదిమంది పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత దక్కించుకుంది ఏపీ ప్రభుత్వం. లబ్దిదారుల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించడంతో పాటు ఉచిత వైద్యం అందిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఏపీ టాప్‌లో ఉంది.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో బీమా కింద ఉచిత వైద్యం అందిస్తున్నారనే గణాంకాల్ని నీతి ఆయోగ్ (Niti Aayog)విడుదల చేసింది. ఈ జాబితాలో 74.60 శాతంతో టాప్‌ప్లేస్ ఏపీకు దక్కింది. ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తున్నవారికంటే ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ పరిధిలో వచ్చారు. ఏపీలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 2 వేల 436 రకాల చికిత్సల్ని ఆరోగ్యశ్రీ(Arogyasri) పరిధిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. పేదలకు ఇంత పెద్దఎత్తున ఉచిత బీమా అందిస్తూ వైద్యం చేయిస్తున్న ఘనత దేశంలో మరే రాష్ట్రానికీ లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దక్షిణాదిన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు, ఉత్తరాదిన ఎంపీ, యూపీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఏపీలో పోడీపడలేకపోయాయి. ఇన్సూరెన్స్ కవరేజ్‌కు సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన జాబితాలో టాప్‌ప్లేస్ దక్కడంపై ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also read: IPS Transfers: ఏపీలో ఐపీఎస్ బదిలీలు, రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook