Srisailam: మహా శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా శివమాలలు వేసుకునే శివస్వాములు ఒక్కోక్కరుగా ఆలయానికి చేరుకుంటున్నారు. అంతేకాదు శివరాత్రి సందర్బంగా అక్కడ దీక్ష విరిమించనున్నారు. కేవలం శ్రీశైలానికి మన రాష్ట్రం నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల అడవుల్లో దాటుకుని శ్రీశైలం తరలివస్తారు. అందులో కొంత మంది శివస్వాములు కాలి బాటన శ్రీశైలానికి చేరుకుంటున్నారు.
నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజ శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు. యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు చేపట్టారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు. సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు మయూరి వాహనసేవ నిర్వహించారు. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంస వాహనంపై ప్రత్యేక పూజాదికాలు చేపట్టారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. మొత్తంగా శివరాత్రి వరకు పూటకో వాహన సేవలో మల్లన్న స్వామి ఊరేగనున్నారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.