YS Jagan Budget Session: సంక్షేమ పథకాలతో ఐదేళ్లు పాలించిన వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. క్రికెట్ జట్టు మాదిరి కేవలం 11 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. చంద్రబాబు నిరాకరిస్తుండడంతో ఇదే కారణంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను జగన్ బహిష్కరించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా చర్చనీయాంశమైంది.
Also Read: Kalingiri Shanthi: బాధ్యతల్లో భాగంగా ఎంపీ విజయ సాయిని కలిస్తే రంకు అంటగడుతారా? కలింగిరి శాంతి
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే అసెంబ్లీలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుబట్టారు. అసెంబ్లీ స్పీకర్‌కు కూడా వినతిపత్రం ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి.. స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు జరిగాయి.
Also Read: Chandrababu Naidu: చంద్రబాబు సంచలనం.. నడిరోడ్డుపై ప్రజల కోసం ఆపిన కాన్వాయ్
అయితే అసెంబ్లీలో వైసీపీ హోదాపై స్పష్టత లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాను జగన్ డిమాండ్ చేశారు. అయితే అది సాధ్యం కాదని జగన్‌ను వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే గుర్తిస్తామని అసెంబ్లీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పయ్యావుల కేశవ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో జగన్ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరిగాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా పార్టీని గుర్తించేందుకు ఎలాంటి నిర్ణీత నిబంధనలు లేవని న్యాయ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏ రకంగా చూసినా?
ప్రభుత్వం ఎలాగైనా వ్యవహరిస్తే ఇబ్బంది లేదని.. అంటే హోదా ఇచ్చినా, నిరాకరించినా సమస్య ఉండదని తెలిసింది. దీనికోసం 2014,2019 పార్లమెంట్ వ్యవహారాల గురించి కూడా న్యాయ నిపుణులు ప్రస్తావించారు. పదేళ్లుగా పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా మోదీ దేశాన్ని పాలించిన విషయాన్ని గుర్తుచేస్తురు. ఈ నేపథ్యంలో వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
బహిష్కరణ?
అసెంబ్లీ ప్రతిపక్ష హోదా గుర్తింపు ఏ రకంగా దక్కదని స్పష్టంగా తెలుస్తుండడం మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. అయితే అసెంబ్లీ సమావేశాలను మాజీ సీఎం జగన్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకైనా వస్తారా? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. దీనిపై వైసీపీ వర్గాల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Assembly Session: అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్తారా? లేదా చంద్రబాబులా బహిష్కరిస్తారా?