AP: Fee Reimbursement: ఇక ఎప్పటికప్పుడే ఫీజుల చెల్లింపు

ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తుంది. బకాయిలనే మాటే విన్పించదని ప్రభుత్వం చెబుతోంది.

Last Updated : Dec 24, 2020, 07:47 AM IST
  • జగనన్న విద్యా దీవెనగా మారిన ఫీజు రీయింబర్స్ మెంట్ పధకం అమలు ఈ ఏడాది నుంచే
  • ఇకపై ఎప్పటికప్పుడు ఫీజుల చెల్లింపులు..గత ప్రభుత్వ బకాయి చెల్లించిన ప్రభుత్వం
  • ఇక నుంచి నేరుగా విద్యార్ధి తల్లి ఖాతాలో ఫీజు జమ
AP: Fee Reimbursement: ఇక ఎప్పటికప్పుడే ఫీజుల చెల్లింపు

ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తుంది. బకాయిలనే మాటే విన్పించదని ప్రభుత్వం చెబుతోంది.

దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ys Rajasekhar reddy ) ప్రారంభించిన ప్రతిష్ఠాత్మకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ( Fee Reimbursement scheme )పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) కీలకమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల ఫీజులు ఇకపై బకాయిలు ఉండవని స్పష్టం చేసింది. విద్యార్ధుల ఫీజుల్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపింది. ఈ పథకం కొత్త రూపుతో జగనన్న విద్యా దీవెనగా మారింది. గత టీడీపీ ప్రభుత్వం ( Tdp Government ) లో కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఉన్న బకాయి 18 వందల 80 కోట్లను ప్రభుత్వం చెల్లించేసింది.

జగనన్న విద్యా దీవెన పథకం ( Jagananna vidya deevena ) కింద ప్రభుత్వం దాదాపు 16 లక్షలమంది పోస్టు మెట్రిక్ కోర్సులు చేస్తున్న పేద విద్యార్ధుల కోసం ఏడాదికి 5 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటివరకూ కాలేజీలకున్న బకాయిల్ని చెల్లించేసిన ప్రభుత్వం ఇకపై బకాయిలనేవి ఉండకుండా ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లించనుంది. అది కూడా నేరుగా విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనుంది. 

జగనన్న విద్యా దీవెన పథకంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్  కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వం వెబ్‌సైట్ ఓపెన్ చేసింది. కొత్తగా కోర్సుల్లో చేరే విద్యార్ధులు ఆయా కళాశాలల ద్వారా 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. రెన్యువల్స్ 70 శాతం పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. 

Also read: AP: స్థానిక సంస్థల సంస్కరణల్లో ఏపీ, ఎంపీలే టాప్..కేంద్రం ప్రశంసలు

Trending News