Covid-19 Cases updates in Andhra Pradesh: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ మహమ్మారి కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా ( Coronavirus ) బారిన పడుతున్నారు. గత 24గంటల్లో 54,463 కరోనా టెస్టులు చేయగా.. 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 86మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా గణాంకాల ప్రకారం.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,58,817కి పెరగగా.. ఇప్పటివరకు 3,368 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. Also read: Adimulapu Suresh: ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 89,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 2,68,828 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,92,501 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..
Also read: Murder Movie: వర్మకు కోర్టు షాక్.. ‘మర్డర్’కు బ్రేక్
AP: కొత్తగా 8,601 కరోనా కేసులు.. 86 మంది మృతి