One time settlement offer: ఇంటి స్థలాలను తనఖా పెట్టి రుణం తీసుకున్న వారికి ఏపీ ప్రభ్వుతం తీపి కబురు, వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌‌

AP State Housing Corporation:వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానం వల్ల ఏపీలో 46,61,737 మందికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాజాగా సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2021, 11:47 AM IST
  • గృహ రుణాలపై వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌..
  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • డిసెంబర్‌ 15 వరకు ఈ అవకాశం
One time settlement offer: ఇంటి స్థలాలను తనఖా పెట్టి రుణం తీసుకున్న వారికి ఏపీ ప్రభ్వుతం తీపి కబురు,  వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌‌

AP State Housing Corporation introduced one time settlement offer : ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ (ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌) వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్న వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌‌ (one time settlement offer)పెట్టింది. తనఖా (Mortgage)పెట్టిన ఇంటి స్థలాలను ప్రైవేటు ఆస్తులుగా మారుస్తూ వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్‌ చేయించాలని నిర్ణయించింది. ఈ వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానం వల్ల ఏపీలో 46,61,737 మందికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధ్యక్షతన తాజాగా సచివాలయంలో మంత్రివర్గం (cabinet) సమావేశమైంది. ఇందులో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. 

ఏపీలో 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి ఇళ్ల నిర్మాణం కోసం రూ.9,320 కోట్లను లబ్దిదారులు (beneficiaries) రుణంగా తీసుకున్నారు. దీనిపై వడ్డీ రూ.5,289 కోట్లకు చేరుకుంది. అసలు, వడ్డీ కలిపి రూ.14,609 కోట్లు అయింది. ఇలాంటి రుణాలు తీసుకున్నవారంతా వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లింపులు చేస్తే, వారికి ఇంటి స్థల పత్రాలను అప్పగిస్తారు. వారి పేర్లతోనే రిజిష్ట్రేషన్‌ చేసి ఇస్తారు. దీంతో వారికి ఇళ్లపై పూర్తి హక్కులు వస్తాయి.

గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు పొందిన లబ్దిదారులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అయితే రూ.10 వేలు, మున్సిపాల్టీలకు చెందిన వారు అయితే రూ.15 వేలు, నగర పాలక సంస్థలకు చెందిన వారు అయితే రూ.20 వేలను వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తే సరిపోతుంది.

Also Read : Kohli step down from t20 captain: కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై!

హౌసింగ్‌ కార్పొరేషన్‌ (housing corporation) నుంచి రుణం తీసుకుని నిర్మించుకున్న ఇంటిని ఒకవేళ ఎవరికైనా అమ్మినట్లయితే.. ఆ ఇంటిని కొనుగోలు చేసిన వారికి మరెక్కడా ఇంటి స్థలం ఉండకుండా, వారు పేద వారైతే అలాంటి వారు గ్రామీణ ప్రాంతాలలో రూ.20 వేలు, మున్సిపాల్టీల్లో రూ.30 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.40 వేలు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకోకుండా సొంతంగా ఇల్లు కట్టుకుని ఉంటే, రూ.10వేలు చెల్లిస్తే వారికి ఇంటి స్థలంపై వారికి ఇంటి స్థలంపై ప్రభుత్వం హక్కులు కల్పిస్తుంది. ఇక ఇలాంటి స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి మరెక్కడా ఇంటి స్థలం లేకపోతే.. వారు పేద వారైతే గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాల్టీల్లో (municipalities) రూ.15 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.20 వేలను చెల్లించి పూర్తి హక్కులు పొందవచ్చు.

ఇక వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ కింద చెల్లింపులు చేయడానికి చివరి తేదీ డిసెంబర్‌ 15. చెల్లింపులు చేసిన వారికి డిసెంబర్‌ 21న ఇంటి స్థలం పత్రాలను అప్పగిస్తారు. అలాగే వారి పేర్లతోనే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించి పూర్తి హక్కులు కల్పిస్తారు. వలంటీర్లు.. గ్రామ, వార్డు సచివాలయ, మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి.. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధ్యక్షతన మంత్రివర్గం నిర్ణయించింది. 

Also Read : Shocking News: వీడు చదివేదే 6వ తరగతి.. కానీ బ్యాంకు అకౌంట్లో రూ. 900 కోట్లు!స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News