AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు

AP Election Results Wine Shops Close For Three Days: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 2, 2024, 06:44 PM IST
AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు

AP Election Results: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆంధ్రప్రదేశ్‌లో చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘంతోపాటు అన్ని శాఖల అధికారులు సంసిద్ధమవుతున్నారు. ఇక తమ భవిష్యత్‌ తెలిపే ఫలితాలు కావడంతో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలకు లెక్కలు వేసుకుంటూ వార్‌ రూమ్‌లు సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో తేలనున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు నిషేధిస్తూ ఉత్వర్వులు జారీచేసింది.

Also Read: AP Election Exit Polls: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ మొండిచేయి.. పత్తా లేని వైఎస్‌ షర్మిల

 

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు ఆ తర్వాత వారం రోజులు ఏపీలో తీవ్ర ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం కూడాగొడవలు జరిగే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితాల అనంతరం విజయోత్సవాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ర్యాలీలు చేయడం నిషేధించింది. దీనికితోడు ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత కూడా మద్యం విక్రయాలు నిషేధించాలని నిర్ణయించడం గమనార్హం. జూన్‌ 3, 4, 5వ తేదీల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Also Read: YS Jagan Viral Post: సరిగ్గా ఈరోజు జరిగిందే పునరావృతం.. ఇది తథ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ వైరల్‌

 

మూడు రోజుల నిషేధం అనంతరం మళ్లీ ఆరో తేదీన గురువారం మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అయితే మద్యం దుకాణాలు మూడు రోజుల పాటు మూసివేయనుండడంతో మందుబాబులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆ రోజుల్లో మద్యం లభించందనే నేపథ్యంలో ముందే కొనేసి పెట్టుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. మందుబాబులు ఎగబడడంతో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. ఒక్కో వ్యక్తి కాటన్‌, ఫుల్‌, నాలుగైదు బాటిళ్లు తీసుకెళ్తూ కనిపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News