AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా రేపటికి పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా మారనుంది. మరో మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలనుంది. ఫలితంగా ఉత్తర కోస్తాంద్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఇక మరో 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది.
విజయవాడలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ, రేపు కూడా విజయవాడకు భారీ వర్ష సూచన ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. జక్కంపూడి కాలనీ, అంబాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద మరోసారి పెరుగుతోంది. అటు సింగ్ నగర్, రాజరాజేశ్వరి నగర్ ప్రాంతాల్లో మరోసారి నీటమట్టం పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
ఇవాళ ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. రేపు కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
Also read: Leopard Warning: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్, చిరుత పులి ఉంది బయటకు రావద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.