Atchutapuram SEZ: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?

Escientia Pharma Plant Tragedy: ఏపీలో సంభవించిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా.. 54 మందికి పైగా గాయపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 22, 2024, 12:38 AM IST
Atchutapuram SEZ: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?

Reactor Blast At Escientia Pharma In Atchutapuram SEZ: ఏపీలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని శ్లాబ్‌లు కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. పదుల సంఖ్యలో గాయాలపాలైన వారి పరిస్థితి మరింత విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైఎస్‌ షర్మిల, పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: Atchutapuram SEZ: ఏపీలో మరో ఘోరం.. రియాక్టర్‌ పేలి ఏడుగురు దుర్మరణం

శ్లాబ్ కూలడంతో?
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఎస్ఎన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కంపెనీలో దాదాపు 350కు పైగా ఉద్యోగులు పని చేస్తుంటారు. మధ్యాహ్న భోజన విరామం కావడంతో చాలా మంది భోజనానికి వెళ్లారు. సుమారు 2:30 సమయంలో రెండో అంతస్తులో రియాక్టర్ పేలింది. వెంటనే మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు.. భోజనానికి వెళ్లిన ఉద్యోగులు అవస్థలు పడ్డారు. అయితే ప్రమాదం ధాటికి భవనంలోని ఒక అంతస్తు శ్లాబ్‌ కూలిపోవడంతో ప్రమాదం తీవ్రమైంది. మంటలకు కొందరు మరణించగా.. భవనం శ్లాబ్‌ కూలి ఆ శిథిలాల్లో కొందరు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం వరకు 18 మంది మృతి చెందారని.. 50 మందికి గాయపడ్డారు.

Also Read: Maoist Radha: 'విరాట పర్వం' సీన్‌ రిపీట్.. కోవర్టుగా భావించి మహిళా మావోయిస్టు హత్య

సమాచారం అందుకున్న వెంటనే పోలీస్‌, అగ్నిమాప సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రితోపాటు స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. కాగా ప్రమాదంతో గ్రామాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం తీవ్రత పెరగడంతో ఆమె ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బుధవారం సీఎం పర్యటన
అచ్యుతాపురం ప్రమాదంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించారు. జిల్లా అధికారులు, పరిశ్రమలు, ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం జరిపారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్లాంట్ నిర్వహణలో లోపాలపై సమాచారాన్ని చెప్పారు. ప్రమాదం తర్వాత ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సక్రమంగా లేదని చెప్పడంతో ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీగా ప్రాణనష్టం సంభవించడం తీవ్రంగా కలచివేసిందని సీఎం తెలిపారు. గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పారు.

మృతుల వివరాలు
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మృతులు వీరే.. (మరికొందరివి తెలియాల్సి ఉంది)
సన్యాసి నాయుడు
రామిరెడ్డి
హారిక
పార్థసారథి
చిన్నారావు
రాజశేఖర్‌
మోహన్‌
గణేశ్‌
ప్రశాంత్‌
నారాయణరావు

మరో ప్రమాదం
అనకాపల్లి సంఘటన ఘోరం జరిగిన కొన్ని గంటల్లోనే ఏపీలో మరో సంఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలోని 3ఎఫ్ పామాయిల్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో బాయిలర్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. కాగా ప్రమాదంతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది. అనకాపల్లి మాదిరి ప్రమాదం తీవ్రంగా ఉంటుందా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News