ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో ఎయిర్ ఫోర్స్ F-16 యుద్ధ విమానం మార్చి 11న (బుధవారం) క్రాష్ అయిందని ఓ అధికారి వెల్లడించారు. ఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. రాయిటర్స్ ప్రతినిధి పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఫోన్లో మాట్లాడారు.
A Pakistan Air Force (PAF) F-16 aircraft crashed near Shakarparian, Islamabad today during rehearsals for Pakistan day parade: Pakistan media
— ANI (@ANI) March 11, 2020
అమెరికా రూపొందించిన F-16 యుద్ధ విమానం పాకిస్థాన్ డే ఎయిర్ షో సన్నాహకాలలో భాగంగా చేస్తున్న విన్యాసాలలో కూలిపోయింది. మార్చి 23న పాకిస్థాన్ డే ఎయిర్ షో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఫైటర్ జెట్ రిహార్సల్స్ చేస్తుండగా కూలిపోయిందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!