ఇండో పాక్ సరిహద్దుల్లో భూకంపం ; 50 మందికిపైగా గాయాలు, భారీగా ఆస్తి నష్టం

పాకిస్తాన్ తో కేంద్రంగా భూకంపం..ఉత్తర భారత దేశంలో భూ ప్రకంపనలు

Last Updated : Sep 24, 2019, 07:02 PM IST
ఇండో పాక్ సరిహద్దుల్లో భూకంపం ; 50 మందికిపైగా గాయాలు, భారీగా ఆస్తి నష్టం

ఇమ్రాన్ సర్కార్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలకు మరో పెద్ద కష్టం వచ్చి పడింది. ఈ రోజు ఆ దేశ భూభాగంలో పలు చోట్ల తీవ్ర భూకంపం సంభవించింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో (4:32 PM) పాక్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు రావల్పిండి, పెషావర్ నగరాలతో పాటు సియల్ కోట్, మాల్ కండ్, చిత్రాల్, మన్ సెహ్రా ముల్తాన్ , బజౌర్ ప్రాంతాల్లో భూపంకం సంభవించింది.  కాగా రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.3 గా నమోదైంది. 8 నుంచి 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. లాహోర్ కు వాయువ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం. 

భయంతో పరుగులు

భూ ప్రకంపనలు  రావడంతో ఆయా ప్రాంతాల్లోని జనాలు భయాందోళనలకు గురై.. తమ తమ నివాసాలు, కార్యలయాల  నుంచి బయటకు పరుగులు తీశారు.ప్రముఖ మీడియా కథనం ప్రకారం భూకంప వల్ల పాకిస్తాన్ ప్రాంతలో 15 మంది మరణించగా 150 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. కాగా ఒక్క పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోనే  ఐదుగురు మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. భూకంప ప్రభావం వల్ల చాలా చోట్ల రవాణ  వ్యవస్థ అస్తవ్యస్తమైంది. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.భూకంప నష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఉత్తరభారతంతోనూ భూప్రకంపనలు

ఇదిలా ఉంటే ఉత్తర భారతదేశంలో పలు చోట్ల ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. కశ్మీర్ తో పాటు ఢిల్లీ, నోయిడా, హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ల లోని పలు ప్రాంతాల్లో  భూమి కంపించినట్లు కథనాలు వెలవడుతున్నాయి. 

Trending News