T Square Designs: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతుండగా.. ఈ మహానగరం సిగలో మరో కలికి తురాయి రాబోతున్నది. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన నగరంగా తీర్చిదిద్దాలనే కేసీఆర్ కలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాటిస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వం యోచించిన టైమ్ స్క్వేర్ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తోంది. అందులో భాగంగానే తాజాగా టైమ్ స్క్వేర్‌కు సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా టైమ్ స్క్వేర్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతిపాదనలు, నమూనాలను ప్రభుత్వం పరిశీలించి త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Telangana DAs: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి పటాకా.. రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే?
హైదరాబాద్ రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నిర్మాణానికి సంబంధించి పలు సంస్థలు కొన్ని డిజైన్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. టైమ్ స్క్వేర్‌పై ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు డిజైన్లను రూపొందించి నిర్మాణాల ప్రెజెంటేషన్లను ఇచ్చారు. ఆ డిజైన్‌లను సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వాటిని సమీక్షించిన అనంతరం పలు సూచనలు అందించారు.
Also Read: KTR: బరాబర్ జైలుకు పోతా.. రేవంత్ రెడ్డి అయ్యకు కూడా భయపడను
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా టీ-స్క్వేర్‌ను రూపొందించాలని ఆయా సంస్థలకు శ్రీధర్ బాబు తెలిపారు. భారీ ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, డిజిటల్ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాలని సూచించారు. వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు మైమరిచిపోయేలా సాంస్కృతిక ప్రదర్శనలు, గాయకుల సందడి వంటివి ఉండాలని చెప్పారు. నిత్యం తెరిచి ఉండేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక థీమ్‌తో కూడిన షాపింగ్ మాల్స్ ఉండాలని సంస్థలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వం చెప్పిన సూచనలు, సలహాలు పాటించి మరింత అందమైన.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజైన్లతో మరోసారి సంస్థలు ప్రభుత్వం ముందుకు రానున్నాయని సమాచారం. త్వరలోనే తుది డిజైన్లను ఖరారు చేసి టీ స్క్వేర్ శరవేగంగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి