Telangana Inter Results 2024: ఇంటర్ విద్యార్ధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదల సమయం వచ్చేసింది. మరి కాస్సేపట్లో తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్ధులు తమ హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత ఆన్లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ జరిగింది. ఎన్నికల సంఘం అనుమతి కూడా లభించడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 9 లక్షల 80 వేల 978 మంది ఇంటర్ పరీక్షలు రాశారు గత ఏడాది ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 15న ముగియగా ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరీక్షలు 15 రోజులు ముందే ముగిసినా ఫలితాల వెల్లడి కాస్త ఆలస్యమైంది. ఇదే తేదీల్లో జరిగిన ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12నే విడుదలయ్యాయి.
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్ధుల్లో 4 లక్షల 78 వేల 527 మంది మొదటి సంవత్సరం అయితే 4 లక్షల 43 వేల 993 మంది రెండవ సంవత్సరం విద్యార్ధులున్నారు. ఇంటర్ విద్యార్ధులు కేవలం తమ హాల్‌టికెట్ ఎంటర్ చేసి https://tsbie.cgg.gov.in/ లేదా https://results.cgg.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇక తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు మాత్రం ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి.
Also read: TS Speaker: ఇరకాటంలో 'తెలంగాణ స్పీకర్'.. ఎన్నికల్లో అనూహ్య పరిణామం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook