Asaduddin Owasi: తాజ్ మహల్ కంటే అందంగా కొత్త సెక్రటేరియట్‌.. లోపల మసీదు నిర్మాణం

MIM Chief Asaduddin Owasi: తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై అసదుద్దిన్ ఒవైసి మాట్లాడుతూ .. అక్టోబర్ వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని బదులిచ్చారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం గురించి స్పందిస్తూ.. కేసీఆర్ దేశంలోనే తాజ్ మహల్ కంటే అందమైన సెక్రటేరియట్‌ని నిర్మించారు అని వ్యాఖ్యానించారు.

Written by - Pavan | Last Updated : Feb 10, 2023, 05:07 AM IST
Asaduddin Owasi: తాజ్ మహల్ కంటే అందంగా కొత్త సెక్రటేరియట్‌.. లోపల మసీదు నిర్మాణం

MIM Chief Asaduddin Owasi: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి బిఆర్ఎస్ పార్టీ పరిపాలనపై, ఆ పార్టీతో దోస్తీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం అని అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన అందిస్తున్నారు. అలాంటి బిఆర్ఎస్ దేశమంతా వస్తే మరీ మంచిదే కదా అని వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై ప్రశ్నించగా.. అక్టోబర్ వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని బదులిచ్చారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం గురించి స్పందిస్తూ.. కేసీఆర్ దేశంలోనే తాజ్ మహల్ కంటే అందమైన సెక్రటేరియట్‌ని నిర్మించారు. కొత్త సెక్రటేరియట్‌లో మసీదు నిర్మాణం చేయాల్సిందిగా కోరాం. అలాగే నిర్మిస్తున్నారు అంటూ సెక్రటేరియట్ ఆవరణలో మసీదు నిర్మిస్తున్నట్టు తెలిపారు. సెక్రటేరియట్ ఓపినింగ్ అధికారిక కార్యక్రమం కనుక అక్కడికి వెళ్తాం అని స్పష్టంచేశారు. పరేడ్ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ మీటింగ్ గురించి ప్రశ్నపై స్పందిస్తూ అది బిఆర్ఎస్ పార్టీ రాజకీయ సమావేశం. మాకు సంబంధం లేని విషయం అని అభిప్రాయపడ్డారు. 
 
ఎంఐఎం పార్టీని బిజేపీ బీ టీం అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. కానీ బిజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని మేం డిమాండ్ చేస్తున్నాం అని చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోన్న గౌతం అదాని షేర్స్ అంశంపై స్పందిస్తూ.. పార్లమెంట్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిటిని నియమించి అదాని అంశంపై విచారణ జరిపించాలని తాము పట్టుబట్టామని.. కానీ ప్రధాని మోదీ ఒప్పుకోవడం లేదు అని తెలిపారు. పలు అంశాలపై బిఆర్ఎస్ పార్టీ పరిపాలన తీరును ఆకాశానికెత్తిన అసదుద్దీన్.. జాతీయ రాజకీయాల్లోకి ఆ పార్టీ రాకను స్వాగతిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. అసదుద్దీన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు జాతీయ రాజకీయాల్లో పరస్పరం సహకరించుకోనున్నట్టు స్పష్టం అవుతోంది.

ఇది కూడా చదవండి : Revanth Reddy Challenges KTR: నేను రెడి.. నువ్వు రెడినా ? కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్..

ఇది కూడా చదవండి : Revanth Reddy Challenges KCR: రేవంత్ రెడ్డి నోట మళ్లీ అదే మాట.. ప్రభుత్వానికి అదే సవాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News