Hyderabad Drugs Case: హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక్కొక్కటిగా కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో పబ్‌లో జరిగిన ఓ బర్త్ డే పార్టీపై పోలీసులు ఫోకస్ చేశారు. పోలీసులు దాడి చేసిన రోజు రాత్రి పబ్‌లోని మూడు టేబుళ్లపై బర్త్ డే పార్టీ జరిగింది. ఆ మూడు టేబుళ్లలో ఎవరెవరు ఉన్నారు... వారు తీసుకున్న డ్రింక్స్‌లో ఏం కలిసిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే పోలీసులు పబ్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పటికీ... ఇరుకు గది కావడం, అంతా చీకటిగా ఉండటంతో ఆ మూడు టేబుళ్లపై ఉన్న వ్యక్తులను సరిగా గుర్తించలేకపోయారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న అనిల్, అభిషేక్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
సినీ సెలబ్రిటీలతో 'అభిషేక్'కి సంబంధాలు
ఈ కేసులో ఏ2గా ఉన్న ఉప్పల అభిషేక్‌కి పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖ హీరోలు, హైప్రొఫైల్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అభిషేక్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అభిషేక్ చంచల్‌గూడ జైల్లో రిమాండులో ఉన్నాడు. మరోవైపు, అభిషేక్‌పై వస్తున్న ఆరోపణలను అతని తల్లి ఉప్పల శారద ఖండించారు. ఆ పబ్‌కి తన కొడుకు అభిషేక్ పార్ట్నర్ మాత్రమేనని... డ్రగ్స్ వ్యవహారంతో అతనికి సంబంధం లేదని అన్నారు. అనవసర దుష్ప్రచారంతో అభిషేక్‌ని వేధించవద్దన్నారు.
ఇలా వెలుగులోకి :
ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న 150 మంది వరకు యువతీ యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరుసటిరోజు ఉదయం ఈ వ్యవహారం బయటకొచ్చింది. పలువురు సినీ, రాజకీయ, వీఐపీల పిల్లల పేర్లు బయటకొచ్చాయి. అందులో మెగా డాటర్ నిహారిక కొణిదెల, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వారంతా తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: IPL 2022 Points Table: ఐదో స్థానంలో లక్నో.. అట్టడుగు స్థానంలో హైదరాబాద్! ఆరెంజ్ క్యాప్ రేసులో
Vimala Raman Wedding: తమిళవిలన్ను పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook