Hyderabad old city Lathi Charge: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సిటీలో హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 7 గంటలకే దుకాణాలు మూసేసి వెళ్లాలని.. అనవసర వదంతులు నమ్మి ఇళ్లలోంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది యవకులు పోలీసులు విధించిన ఆంక్షలను అతిక్రమించి అర్థరాత్రి వేళ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీలకు పనిచెప్పి యువకులను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే ఆందోళనకు పాల్పడి వెళ్లి ఇళ్లలో దాక్కున్న వారిని బయటకు లాగీ మరీ చితక్కొట్టి పోలీసు జీప్ ఎక్కించారు. లాఠీ ఛార్జ్ షాకింగ్ విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి