మురుగు నీటిలో కరోనావైరస్.. CCMB కీలక ప్రకటన

కరోనావైరస్‌‌పై ( Coronavirus ) వివిధ రకాల అధ్యయనాలు చేయడం ద్వారానే వైరస్‌ మూలాలను కనుక్కుని, వైరస్‌కి చెక్ పెట్టవచ్చని సీసీఎంబీ ( CCMB ) పేర్కొంది. హైదరాబాద్‌లో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ ( CSIR ), ఐఐసిటి ( IICT ) పరిశోధన సంస్థలతో కలిసి పలు అధ్యయనాలు నిర్వహిస్తున్న సీసీఎంబీ తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించింది.

Last Updated : Aug 21, 2020, 04:10 AM IST
మురుగు నీటిలో కరోనావైరస్.. CCMB కీలక ప్రకటన

హైదరాబాద్‌: కరోనావైరస్‌‌పై ( Coronavirus ) వివిధ రకాల అధ్యయనాలు చేయడం ద్వారానే వైరస్‌ మూలాలను కనుక్కుని, వైరస్‌కి చెక్ పెట్టవచ్చని సీసీఎంబీ ( CCMB ) పేర్కొంది. హైదరాబాద్‌లో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ ( CSIR ), ఐఐసిటి ( IICT ) పరిశోధన సంస్థలతో కలిసి పలు అధ్యయనాలు నిర్వహిస్తున్న సీసీఎంబీ తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించింది. మురుగు నీటిలోనూ కరోనావైరస్‌ ఆనవాళ్లు ఉంటాయని చెప్పిన సీసీఎంబీ.. ఐతే మురుగు నీటిలో వైరస్‌ ఉనికి గుర్తించినప్పటికీ అది వేరొకరికి సంక్రమించదని అభిప్రాయపడింది. తాము జరిపిన పరిశోధనల్లో 80 శాతం మురుగు నీటి కేంద్రాల్లో వైరస్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించామని సీసీఎంబి పేర్కొంది. హైదరాబాద్‌లోని సీసీఎంబీ కరోనా పరీక్ష కేంద్రాలలో ఈ అధ్యయనం నిర్వహించారు. Also read : COVID-19: ఏపీలో 3000 దాటిన కరోనా మృతుల సంఖ్య

ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల విషయానికొస్తే.. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదస చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం మంగళవారం నుండి బుధవారం మధ్య జరిపిన కరోనా పరీక్షల్లో 1,763 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఇప్పటివరకు తెలంగాణలో కరోనావైరస్‌‌ కేసుల సంఖ్య మొత్తం 95,700 కి చేరగా.. కరోనాతో మొత్తం 719 మంది చనిపోయారు. Also read : IPL 2020 logo: ఐపిఎల్ 2020 కొత్త లోగో వచ్చేసింది

Trending News