Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. డూమ్‌లు కూల్చేస్తాం..

Bandi Sanjay On New Secretariat Building: బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ డూమ్‌లు కూల్చివేస్తామంటూ సంచలన కామెంట్స్ చేశారు బండి సంజయ్. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 12:45 PM IST
  • తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తాం..
  • ప్రగతి భవన్‌ను ప్రజా దర్భార్‌లా మారుస్తాం..
  • బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నాటకం ఆడుతున్నాయి: బండి సంజయ్
Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. డూమ్‌లు కూల్చేస్తాం..

Bandi Sanjay On New Secretariat Building: తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే నూతన సచివాలయ డూమ్‌లు (గుమ్మటాలు)ను కూల్చేస్తామని స్పష్టంచేశారు. జనం గోస–బీజేపీ భరోసాలో భాగంగా కూకుట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లిలో 77, 78,79 వార్డుల పరిధిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని.. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని అన్నారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని చెప్పారు.

ప్రగతి భవన్‌ను ప్రజా దర్భార్‌లా మారుస్తామన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచివేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే సచివాలయాన్ని తాజ్‌మహల్ లాంటి సమాధిలా మార్చారని ఆరోపించారు. రోడ్డుకు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కులుస్తామన్న కేసీఆర్ దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చివేయాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నాటకం ఆడుతున్నాయంటూ ఫైర్ అయ్యారు.

'కూకట్‌పల్లిలో పేదల భూములను కబ్జా చేశారు. ప్రశ్నించి వారిపైనే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెడతాం.. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారు. బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు మోదీ పాలనా విజయాలను వివరిస్తాం. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్, ప్రగతి భవన్‌కు పరిమితమయ్యారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదు.

రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్  నుంచే వస్తోంది. హైదరాబాద్‌ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలి. దుర్మార్గులు, దుష్టులు ఇద్దరు ఏకమై బీజేపీకి మేయర్ పదవి రాకుండా చేశారు. మూతపడ్డ ఫైనాన్స్ దుకాణానికి కొత్త పేరు పెట్టి తెరిచినట్లుగా ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలు చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం 3 కోట్ల ఇండ్లు ఇచ్చింది. కేసీఆర్ ఎంత మందికి డబల్ బెడ్రూంలు ఇచ్చారో చెప్పాలి. అన్ని ఛార్జ్‌లను పెంచిన కేసీఆర్  భూములు కబ్జాతో వేల కోట్లు సంపాదిస్తున్నారు. వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు..' అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

Also Read: Womens T20 World Cup: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పాక్‌తో పోరుకు స్మృతి మంధాన దూరం..!  

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 18 నెలల పెండింగ్ డీఏపై త్వరలో ప్రకటన..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News