Etela Rajender Comments On CM KCR: సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత కొత్త రూపం ఎత్తారని.. భూములు అమ్ముకొని బ్రోకర్‌గా మారారని ప్రజలు అనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జోన్ కన్వర్ట్ చేయడం.. అసైన్డ్ భూములు లాక్కోవడం.. పరిశ్రమల పేరుతో భూములు సేకరించడం పేరుతో కేసీఆర్ భూములు పేదవారి చేతిలో లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీఓ 220 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భూప్రక్షాలన, ధరణి తీసుకువచ్చి వేల ఎకరాల అన్ ఐడెంటిఫీడ్ ల్యాండ్లను కేసీఆర్ బినామీ పేర్లకు మార్చుకున్నారు. లక్షల కోట్ల భు కుంభకోణం చేస్తున్నారు. నిర్మల్ పురాతన పట్టణం. ఎన్నో ఏళ్ల కిందనే సోఫీ నగర్ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్‌గా ప్రకటించారు. ఇప్పుడు అక్కడ పరిశ్రమలు మూతపడడంతో ఆ భూములు అమ్ముకోలేరని వారిని భయపెట్టి మంత్రి అనుచరులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. భూములు వారి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్‌గా మార్చారు. గ్రీన్ జోన్లో ఉన్న మంజులపూర్, తల్వెద గ్రామాలను ఇండస్ట్రియల్ జోన్‌గా మార్చి మట్టిని నమ్ముకొని బతుకుతున్న రైతుల కళ్ళలో మట్టి కొట్టారు.
రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. రింగ్ రోడ్డు ఎటు వస్తుంది తెలుసుకొని రైతుల దగ్గర ముందే తక్కువ ధరకు కొనుక్కొని రైతులను మోసం చేసి బీఆర్ఎస్ నాయకులు బాగుపడుతున్నారు. గ్రీన్ బెల్ట్, కన్సర్వేషన్ జోన్లో ఉన్న భూములను కన్వర్ట్ చేసుకొని కోట్లు సంపాదిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల భూములు లాక్కుంటున్నారు. మహేశ్వర్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువచ్చేది ప్రతిపక్షాలు. ప్రజలకు విశ్వాసం కలిగించేది మేము. కానీ కేసీఆర్ మాత్రం చక్రవర్తిలాగా, నిజాం సర్కార్ లాగా వ్యవహరిస్తూ.. నేను యజమానినీ ప్రజలు జీతగాళ్లు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.." అని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.
బడంగిపేటలో ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన భూములలో 24 ఎకరాల భూమి గుంజుకున్నారని.. ఒక్కో ఎకరం 20 కోట్ల విలువ చేస్తుందని అన్నారు. కేసీఆర్ మాటలు తియ్యగా ఉంటాయని.. చేతలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. రైతుల మీద జలగల్లాగా బతకవద్దని హితవు పలికారు. రైతుల నుంచి భూములు లాక్కుంటున్న కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. నిర్మల్ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని.. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని హెచ్చరించారు.
Also Read: Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?
Also Read: Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి