KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం

Bandi Sanjay Kumar Comments On KT Rama Rao: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్ర కలకలం రేపాయి. కేటీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని.. త్వరలో జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 10, 2024, 02:45 PM IST
KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం

Bandi Sanjay vs KTR: తెలంగాణ రాజకీయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి. 'కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు. నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదు. త్వరలో కేటీఆర్‌ను రేవంత్‌ రెడ్డి జైల్లో వేయడం ఖాయం' అని సంచలన ప్రకటన చేశారు.

Also Read: KTR Emotinal: జైలులో కవిత దుర్భరంగా ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ఆవేదన

 

మీడియా ప్రతినిధులతో శనివారం బండి సంజయ్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కవిత బెయిల్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనంతోపాటు దేశ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. 'రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్‌తో జరగబోయేది యుద్దమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తాం' అని తెలిపారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనంపై సంజయ్‌ స్పందిస్తూ.. 'బీఆర్‌ఎస్‌తో బీజేపీ చర్చలు తప్పుడు వార్తలు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ' అని స్పష్టం చేశారు.

Also Read: KT Rama Rao: కుటుంబీకులకు దోచేందుకే రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

 

ఇక కవిత బెయిల్ విషయమై స్పందిస్తూ.. 'కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధం?' అని ప్రశ్నించారు. మనీశ్‌ సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా? అని ఎదురు ప్రశ్నించారు. 'కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదు' అని స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్‌లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ పార్టీకి కొమ్ముకాసిన ఐఏఎస్‌లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని తెలిపారు.

వారే మా బ్రాండ్ అంబాసిడర్లు
'కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేకుండా పోయింది. అతి తక్కువ సమయం ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సే.. రేవంత్‌ రెడ్డే' అని బండి సంజయ్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్యే పోటీ అని పేర్కొన్నారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సహక నిధులివ్వడం లేదు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయి. మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలే మా బ్రాండ్ అంబాసిడర్లు' అని పేర్కొన్నారు.

మేం ప్రభుత్వాన్ని కూల్చం
'కాంగ్రెస్ పార్టీలో  లుకలుకలు మొదలైనయ్. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదు. కాంగ్రెస్‌కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారు. ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంది' అని బండి సంజయ్‌ తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని ఆరోపించారు.

పార్టీలో అసంతృప్తులు.. ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌ విషయమై బండి సంజయ్‌ స్పందిస్తూ.. 'నేను అందరి మనిషిని. కొందరు కాదనుకుంటే నేనేం చేయగలను. పార్టీకి, శాసనసభ్యులకు మధ్య అంతరం ఉందనేది సరికాదు. రాష్ట్ర అధక్ష మార్పు జాతీయ అధ్యక్షులు నడ్దా చూసుకుంటారు. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం' అని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News