Bandi Sanjay: హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్స్: బండి సంజయ్

Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 05:22 AM IST
Bandi Sanjay: హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్స్: బండి సంజయ్

Bandi Sanjay slams CM KCR: హైదరాబాద్పీఎఫ్ఐ లాంటి నిషేధ సంస్ధలను తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాడుకుంటున్నాడని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈసారి హైదరాబాద్ లోనే పక్కాగా సర్జికల్ స్ట్రాక్స్ చేసి తిరుతామని బండి సంజయ్ ప్రకటించారు. ఉగ్రవాదులకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా   మారింది. ఎన్ఐఏ సోదాలు చేస్తేనే 11 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. మరి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఇంకెంత మంది పట్టుబడతారోనని బండి సంజయ్ సందేహం వ్యక్తంచేశారు. అలాంటప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయకూడదో చెప్పండి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

తెలంగాణలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చన్న బండి సంజయ్.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అధికారం పోతుంది అంటే ఏం చేయడానికైనా వెనుకాడరని.. అవసమైతే, పిఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థలను రాజకీయంగా వాడుకునే ప్రమాదం కూడా ఉంది అంటూ కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిఎఫ్ఐ లాంటి సంస్థలను ఉపయోగించుకుని శాంతి భద్రతల సమస్యను సృష్టించడమే కాకుండా అందుకు బాధ్యులుగా మనల్ని బదనాం చేసే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. 

అయ్యప్ప స్వామిని దూషించిన నిందితులకు టిఆర్ఎస్ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. హిందువులను హైదరాబాద్‌లో నరికి వేస్తామన్న మూర్ఖున్ని కాపాడిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పోలింగ్ బూత్ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి : Liquor Sales: కాసుల వర్షం కురిపించిన మందుబాబులు.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్స్

ఇది కూడా చదవండి : TS SI Constable Main Exam Dates: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. మెయిన్ ఎగ్జామ్స్ తేదీలు ఇవే..

ఇది కూడా చదవండి : TSPSC Notifications: నిరుద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News