OPPO A77s: అద్భుత ఫీచర్లతో ఒప్పో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్, ధర ఎంత, ఎప్పుడు లాంచింగ్

OPPO A77s: ఒప్పో త్వరలోనే అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఒప్పో లాంచ్ చేయనున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫో‌న్ ధర ఎంతనేది తెలిసిపోయింది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2022, 09:43 AM IST
OPPO A77s: అద్భుత ఫీచర్లతో ఒప్పో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్, ధర ఎంత, ఎప్పుడు లాంచింగ్

OPPO A77s: ఒప్పో త్వరలోనే అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఒప్పో లాంచ్ చేయనున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫో‌న్ ధర ఎంతనేది తెలిసిపోయింది. ఆ వివరాలు మీ కోసం.

ఒప్పో కంపెనీ ఇటీవల అంటే ఆగస్టు నెలలో OPPO A77 స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టింది. ఇందులో హెలియో జి35 ఉంది. ఇప్పుడు మరో ఫోన్ OPPO A77s లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫీచర్లు, కలర్స్, ధర, లాంచ్ ఎప్పుడనే వివరాలు వెల్లడయ్యాయి. ఇండియాలో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్‌తో బ్లాక్, బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ నాటికి ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. 

OPPO A77s అనేది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో రానుంది. 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, హెలియో జి35 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 12ఓఎస్‌తో పనిచేయనుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంటే..వెనుక వైపున 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమేరాలున్నాయి. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ ఉంది. 

OPPO A77s ఇండియాలో ధర

OPPO A77s ధర గురించి కూడా కొన్ని వార్తలు లీకయ్యాయి. OPPO A77 కంటే ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. OPPO A77 ధర 15, 490 రూపాయలుంది. అయితే ఇప్పుడు OPPO A77s ధర 17 వేలు ఉండవచ్చని అంచనా.

Also read: Excitel Broadband offers: జియో, ఎయిర్‌టెల్‌కు చెమటలు పట్టిస్తున్న ఎక్సీటెల్, తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సేవలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News