Insta new Feature: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ మరో ఆకర్షణీయమైన ఫీచర్ ప్రవేశపెడుతోంది. అద్భుతమైన ఈ ఫీచర్ కోసం చాలాకాలంగా యూజర్లు నిరీక్షిస్తున్నారు.
ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ అత్యంత ఆదరణ కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఫాలోవర్లున్నారు. ఇప్పుడు మాతృసంస్థ మెటా కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలం నుంచి నిరీక్షిస్తున్నారు. ఆ ఫీచర్ ప్రత్యేకతలేంటనేది వివరంగా తెలుసుకుందాం..
ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ రోల్ అవుట్ చేయనుంది. ఈ ఫీచర్ సహాయంతో ఇన్‌స్టా యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని మరింత సులభంగా చేయవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఒకసారి 60 సెకన్ల స్టోరీని ఒక స్లైడ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఇన్‌స్టాలో పోస్టర్ల కంటే ఎక్కువగా స్టోరీల్ని ఇష్టపడుతుంటారు. ఇప్పటి వరకూ ఒక స్టోరీ కేవలం 15 సెకన్లదే ఉండేది. అంటే వీడియో వ్యవధి ఎక్కువగా ఉంటే ఒక స్లైడ్‌లో 15 సెకన్లే వచ్చేది. ఇప్పుడిక 60 సెకన్ల వరకూ అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఎప్పుడు , ఏయే దేశాల్లో లాంచ్ కానుందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read: Bank Holidays October 2022: అక్టోబర్‌లో 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు... పుల్ లిస్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook