దేశంలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీలుగా ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంటాయి. ఒకదానికొకటి పోటీగా మార్కెట్‌లో కొత్త కొత్త ప్రాన్స్ ప్రవేశపెడుతుంటాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.
ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్తగా 149 ప్లాన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఏమాత్రం ఆర్భాటం లేకుండా చడీ చప్పుడు లేకుండా ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ఓటీటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ 148 ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉన్నా..అందుకు భిన్నంగా 149 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రెండింటిలోనూ డేటా మాత్రమే ఉంటుంది. 149 రూపాయల ప్లాన్‌తో లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఎయిర్‌టెల్ 149 డేటా ప్లాన్
ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన 149 రూపాయల ప్లాన్‌లో కేవలం 1 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు పరిమితమైన వ్యాలిడిటీ అంటూ ఏం లేదు. యూజర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న ప్యాక్ వ్యాలిడిటీ ఎన్నిరోజులుంటే అన్నిరోజులు ఇది వర్తిస్తుంది. అంటే మీ ప్రస్తుత ప్లాన్‌లో 30 రోజులు వ్యాలిడిటీ ఉంటే ఇది కూడా అన్నిరోజులుంటుంది.
ఈ ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు 30 రోజులకు ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం యాక్సెస్ లభిస్తుంది. ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం అనేది ఎయర్‌టెల్‌కు చెందింది. దీనిద్వారా యూజర్లు ఒకటే యాప్ ద్వారా 15 కంటే ఎక్కువ ఓటీటీలను సందర్శించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఎక్కుమందిని ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం వైపుకు మళ్లించాలనేది కంపెనీ ఆలోచన. ఈ ప్లాన్‌లో కేవలం 1 జిబీ డేటా మాత్రమే లభిస్తుంది. కేవలం డేటా కోసమైతే ఈ ప్లాన్ అనవసరం. ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం ప్రయోజనాలతో పాటు 1 జిబీ డేటా కోసమైతే ఈ ప్యాక్ మంచిది. కేవలం డేటా మాత్రమే కావాలనుకుంటే ఎయిర్‌టెల్ 148 రూపాయల ప్లాన్ చాలా బెస్ట్ ప్లాన్‌గా ఉంది. ఇందులో 15 జీబీ డేటా లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook