IPL 2021 AB de Villiers | రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను వెనక్కి నెడుతూ అరుదైన ఘనతను 360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
IPL 2021 KKR Captain Eoin Morgan Fined Rs 12 Lakh | ఫోర్లు, సిక్సర్ల వర్షంతో భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 18 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. కానీ క్రికెట్ ప్రేమికులు మాత్రం ఐపీఎల్ మజాను ఆస్వాదించారు. క్రికెట్ ప్రేమికులు కోరుకున్న మ్యాచ్ నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది.
IPL 2021 Mumbai Indians Captain Rohit Sharma Fined: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురుదెబ్బ తగిలింది. రూ.12 లక్షల భారీ జరిమానాకు గురయ్యాడు.
IPL 2021, MI vs SRH match: చెన్నై: ఐపిఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయం కోసం వేచిచూడక తప్పడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరువకుండానే వరుసగా హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది.
MI vs RCB 1st IPL 2021 match: ఐపిఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది.
Big Relief For Mumbai Indians Players And Support Staff | ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌కు మూడు రోజుల ముందు నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి నెగటివ్‌గా తేలింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.
ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. 5 టైటిల్స్ సాధించి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ముంబై ఇండియన్స్ మరోసారి బరిలో దిగుతోంది. ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
Ind vs Eng 5th T20 Highlights | ఇటీవల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు తాజాగా టీ20ల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. నిర్ణయాత్మక చివరి టీ20లో విజయం సాధించింది.
India vs England 1st T20 Updates | సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లను టీ20 ప్రపంచ కప్‌నకు ఎంపిక చేయనున్నారు. మార్చి 12న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
India vs England 4th Test Day 2 Highlights: తొలుత బౌలింగ్‌లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును 205 పరుగులకే పరిమితం చేయగా, ఆపై బ్యాటింగ్‌లో ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
Rohit Sharma Becomes 2nd Indian To get this Record: టెస్టు సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. కీలకమైన నాలుగో టెస్టులోనూ ఓంటరి పోరాటం చేస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
Martin Guptill smashes Rohit Sharmas Highest Sixes Record: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్ధలైంది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్ అయ్యాడు.
తొలి టెస్టులో తేలిపోయిన టీమిండియా బౌలర్లు రెండో టెస్టులో సత్తా చాటారు. తొలి టెస్టులో పరుగుల వరద పారించిన పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌ను రెండో టెస్టులో 150 పరుగుల కూడా చేయకుండా ఆలౌట్ చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (5/43) 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
IPL 2021 CSK Captain MS Dhoni: అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా సీఎస్కే కెప్టెన్ ధోనీ అవతరించాడు. ఈ ఏడాది సైతం రూ.15 కోట్లు అందుకోనున్నాడు.
ఐపీఎల్ వచ్చాక క్రికెట్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ 2020 వరకుగానూ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్ చేరిన భారత ఆటగాళ్లు. తాజా సీజన్ ఐపీఎల్ 2021లో సురేష్ రైనా ఈ జాబితాలో చేరనున్నాడు.
Team India announce Playing XI for the 3rd Test against Australia: ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు భారత తుది జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది. చివరిసారి గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు ద్వారా బరిలోకి దిగనున్నాడు.
Rohit Sharma Tests Negative For COVID-19: మూడో టెస్టుకు ముందు భారత క్రికెటర్లకు భారీ ఊరట లభించింది. భారత ఆటగాళ్లు అయిదుగురికి ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలో అందరికీ కరోనా నెగెటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
Rohit sharma: ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పుడో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి..బీఫ్ తిన్నాడని ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ తిన్నాడా లేదా..అసలు కధేంటి..
Rohit Sharma appointed vice-captain for last two Tests: తాజాగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరాడు. రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. చటేశ్వర్ పుజారా నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు. జనవరి 7న సిడ్నీలో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
India vs Australia Test Series: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పాసయ్యాడు. అదేనండీ.. ఐపీఎల్ 2020 సమయంలో గాయపడ్డ రోహిత్ శర్మ నేడు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తాను సిద్ధమేనని సంకేతాలిచ్చాడు. NCAలో ఫిజియోలు ఓపెనర్ రోహిత్ శర్మకు ఫిట్నెస్ సంబంధిత టెస్టులు నిర్వహించగా టెస్ట్ పాసయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.