బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL) ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సిన బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ (Adjusted Gross Revenue) బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనావైరస్ (Coronavirus) ప్రభావం చాలా రంగాలపై పడింది. అయితే కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కీలక అధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం ( Independence Day ) సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ (Ministry of Home Affairs) మెడల్స్‌ను ప్రకటించింది. ఈ పోలీస్ మెడల్స్ ( Police Medals) ను స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందజేయడం ప్రతీఏటా ఆనవాయితీగా వస్తుంది.
డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) కి ఎదురైన చేదుఅనుభవం.. తనకు కూడా ఎన్నోసార్లు ఎదురైందని, ఇది అసాధరణ విషయం కాదని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం P.Chidambaram) పేర్కొన్నారు.
గాల్వన్ లోయలో ఉద్రిక్తత అనంతరం చైనాకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్‌తో కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పింది. 59 చైనా యాప్‌లపై నిషేధం (India's Decision Over TikTok) విధించడం తెలిసిందే.
గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘతానికి పాల్పడ్డనాటి నుంచి దేశంలో చైనా వస్తువులను, యాప్‌లను నిషేధించాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం చైనాకు చెందిన 59 యాప్‌లను సోమవారం నిషేధిస్తూ ఉత్తర్వులు (59 Chinese apps banned) జారీ చేసింది.
భారత ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలతో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులను ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా వివిధ దేశాలకు తీసుకెళ్లినందుకు ఎయిర్ ఇండియా కేంద్రానికి బిల్లులు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటుంది.
ఈ రోజు ముస్లిం మహిళల రక్షణ కోసం రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే అది ఇంకా శీతాకాల సమావేశాల్లో పూర్తి ఆమోదం పొందాల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.