Sreesanth to join Kerala Ranji team | న్యూ ఢిల్లీ: వివాదాస్పద మాజీ భారత పేసర్ ఎస్ శ్రీశాంత్‌కి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన ఏడేళ్ల కాలం నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండటంతో ఆ తర్వాత అతడిని కేరళ రంజీ జట్టులోకి తీసుకునేందుకు కేరళ క్రికెట్ అసోసియేషన్ ( Kerala Cricket Association - KCA) ఓ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపిఎల్ ( Sreesanth in IPL 2013) టోర్నమెంట్ జరుగుతుండగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడైన శ్రీశాంత్ తో పాటు అదే జట్టుకు చెందిన అజిత్ చండోలియా, అంకిత్ చవాన్‌లను స్పాట్ ఫిక్సింగ్ ( Spot fixing in IPL) నేరం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ నేరంలో చిక్కిన శ్రీశాంత్‌పై బీసీసీఐ ( BCCI ) జీవితకాలం నిషేధం విధించింది.
అయితే, గతేడాదే సుప్రీం కోర్టు ( Supreme Court) సూచన మేరకు అతడిపై జీవిత కాలం నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఆ గడువు ముగియనుంది.
కేరళ రంజీ జట్టులో తనకు అవకాశం కల్పిస్తుండటంపై శ్రీశాంత్ స్పందిస్తూ.. "తనకు అవకాశం ఇచ్చినందుకు తాను కేరళ క్రికెట్ అసోసియేషన్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని అన్నాడు. నా ఆట తీరుతో నేను ఫిట్నెస్ కోల్పోలేదని నిరూపించుకుంటాను. ఇక అన్ని వివాదాలకు ఫుల్స్టాప్ పడే సమయం ఆసన్నమైందని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. KCA ఇటీవలే మాజీ ఫాస్ట్ బౌలర్ టిను యోహానన్‌ను జట్టు కోచ్‌గా నియమించింది.
శ్రీశాంత్ కెరీర్లో27 టెస్టుల్లో 87 వికెట్లు, వన్డే ఇంటర్నేషనల్‌లో 75 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్ కప్ గెల్చుకున్న భారత జట్టులోనూ అప్పట్లోకి శ్రీశాంత్‌కి స్థానం దక్కింది.