manu bhaker maternal grandmother and uncle die in road accident: మనూ భాకర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మను భాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టి సెకన్ లలో పారిపోయారు. మను భాకర్ మామ, అమ్మమ్మ ఇద్దరూ స్కూటీపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన సంభవించింది.
వీరి వాహానాన్ని.. వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో.. వీరు ఎగిరి కింద పడ్డారు. ఈ క్రమంలో తలకు తీవ్ర గాయాలు, రక్తస్రావం కావడంతో సంఘటన స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. దీంతో మనూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మను భాకర్ మామ యుద్ధవీర్ సింగ్ రోడ్‌వేస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మనూ అమ్మమ్మ.. బైటకు పనిమీద వెళ్లేందుకు బయలు దేరారు.
మను భాకర్ మేనమామ ద్విచక్ర వాహనంపై కలియానా మలుపు వచ్చారో లేదో.. ఎదురు నుంచి ఒక బలమైన కారు స్పీడ్ గా వచ్చింది. అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టడంతో.. యుధ్వీర్ సింగ్, సావిత్రి దేవి రోడ్డుపై పడి పోయారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు.
స్పాట్ లోనే ఇద్దరు చనిపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా.. మను భాకర్ రెండు రోజుల క్రితం రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. అంతలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter