IPL Retain: మొత్తం 10 జట్లు రిటైన్‌ చేసుకున్న ప్లేయర్లు వీరే! ఏ జట్టు ఎవరినో తెలుసా?

IPL 2025 Retention Players List Of All 10 Teams Who Got Placed: ఐపీఎల్‌ సమరానికి సమయం దూసుకొస్తోంది. ఈ క్రమంలో ప్లేయర్ల ఎంపికపై జట్లు దృష్టి సారించాయి. రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఇదే!

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 31, 2024, 01:11 PM IST
IPL Retain: మొత్తం 10 జట్లు రిటైన్‌ చేసుకున్న ప్లేయర్లు వీరే! ఏ జట్టు ఎవరినో తెలుసా?

IPL Retentions: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ తదుపరి సీజన్‌ ప్రారంభానికి సమయం సమీపిస్తోంది. ఆరు నెలలు కూడా సమయం లేకపోవడంతో జట్లు తదుపరి టోర్నీ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా వేలానికి ముందు ఆటగాళ్ల ఏరివేతను ప్రారంభించాయని సమాచారం. ఎవరిని నిలుపుకోవాలో.. ఎవరినీ వదులుకోవాలో అనే దానిపై కసరత్తు ప్రారంభించాయి. రిటైన్‌ చేసుకునే ప్లేయర్లపై జట్లు ఒక నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారం చూస్తుంటే రిటైన్‌ అవుతున్న ప్లేయర్ల జాబితా ఒకటి తెలిసింది. మొత్తం 10 జట్లు రిటైన్‌ చేసుకునే ప్లేయర్లు వీరు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Ind vs NZ 2nd Test Highlights: ఇదేం బ్యాటింగ్ స్వామి.. ఉత్తి పుణ్యానికి సిరీస్ ఇచ్చేశారు

టోర్నీలో విజయవంతంగా దూసుకెళ్తున్న జట్లు తమ టాప్ ఆటగాళ్లను అలాగే ఉంచుకోవాలని చూస్తున్నాయి. సత్తా చాటుతున్న ప్లేయర్లను అంటిపెట్టుకోనున్నాయి. అలా అత్యధికంగా ప్లేయర్లను రిటైన్‌ చేసుకునే జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉన్నాయి. గత టోర్నీలలో సత్తా చాటకపోవడంతో కొన్ని జట్లు తమ టీమ్‌ను మొత్తం మార్చాలని చూస్తున్నాయి. ఈ కారణంగా అతి తక్కువ ఆటగాళ్లను రిటైన్‌ చూసుకోవాలని ఆ జట్లు ఉన్నాయి.

తక్కువ ప్లేయర్లను రిటైన్‌ చేసుకునే జాబితాలో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఉన్నాయి. పంజాబ్‌ ఇద్దరు, బెంగళూరు ముగ్గురిని మాత్రమే రిటైన్‌ చేసుకుని జట్టును మొత్తం ప్రక్షాళన చేయాలని భావిస్తున్నాయి. రిటైన్‌ చేసుకున్న అనంతరం  మెగా వేలంలో ఎంత ఖర్చయినా చేసి రేసుగుర్రాలను పట్టుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం.. వస్తున్న వార్తల ప్రకారం.. మొత్తం 10 జట్లు రిటైన్‌ చేసుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితా ఇదే.

Also Read: Ind vs NZ 2nd Test Updates: బెడిసికొట్టిన టీమిండియా వ్యూహం.. కివీస్ దెబ్బకు బ్యాట్స్‌మెన్ విలవిల

 

రిటైన్‌ ఆటగాళ్ల జాబితా ఇదే..
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, మతీష పతిరణ, శివమ్‌ దుబే, మహేంద్ర సింగ్‌ ధోనీ (అన్‌క్యాప్‌డ్‌)
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్ (అన్‌క్యాప్డ్)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, నమన్ ధీర్ (అన్‌క్యాప్డ్)
కోల్‌కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చకరవర్తి, రమణదీప్ సింగ్ (అన్‌క్యాప్డ్)
సన్‌రైజర్స్ హైదరాబాద్: హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్‌ కుమార్ రెడ్డి
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్ (అన్ క్యాప్డ్)
లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మొహసిన్ ఖాన్ (అన్‌క్యాప్డ్)
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్, రశీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్ (అన్ క్యాప్డ్)
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, సందీప్ శర్మ (అన్ క్యాప్డ్)
పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (అన్‌క్యాప్డ్)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News