CSK vs SRH Match: అంపైర్‌ను ధోని బెదిరించాడు.. నెటిజన్ల విమర్శలు

ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్‌లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Last Updated : Oct 14, 2020, 12:44 PM IST
CSK vs SRH Match: అంపైర్‌ను ధోని బెదిరించాడు.. నెటిజన్ల విమర్శలు

IPL 2020 - CSK vs SRH match Netizens slam MS Dhoni : న్యూఢిల్లీ: ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్‌లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంపైర్ పాల్ రైఫిల్ (umpire Paul Reiffel ) ఇవ్వ‌బోయిన వైడ్ నిర్ణ‌యాన్ని ధోనీ అడ్డుకోవడం పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ధోని అంపైర్‌ను బెదిరించి వైడ్ ఇవ్వకుండా అడ్డుకున్నాడంటూ ధోనిని హైదరాబాద్ జట్టు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. శ‌ర్దూల్ థాకూర్ (Shardul Thakur) వేసిన బౌలింగ్‌లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. Also read: David Warner: SRH ఓటమిపై డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే!

స‌న్‌రైజ‌ర్స్ 11 బంతుల్లో 24 ర‌న్స్ చేయాల్సిన సంద‌ర్భంలో.. శార్దూల్ మొదట వైడ్ బాల్ వేశాడు. ఆ త‌ర్వాత బంతిని కూడా శార్దుల్ అదే విధంగా వేశాడు. ఈ క్రమంలో అంపైర్ రైఫిల్‌ ఆ బంతిని వైడ్‌గా ప్ర‌క‌టిద్దామ‌ని చేతులు చాస్తుండ‌గా.. కీప‌ర్ ధోనీ ఆ బంతి వైడ్ కాద‌న్న సంకేతాన్ని ఇచ్చాడు. వైడ్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు చేతులు చాపుతున్న అంపైర్‌ను.. ధోనీ త‌న సంకేతంతో అడ్డుకున్నాడు. ధోని వైపు చూసిన అంపైర్ రైఫిల్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. అయితే ఈ ఘటన పట్ల హైద‌రాబాద్ కెప్టెన్ వార్న‌ర్ ఆగ్ర‌హంతో రగిలిపోయాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ధోని అంపైర్‌ను త‌న సైగ‌ల‌తో బెదిరించాడ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ధోనీ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్‌ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు), బెయిర్ స్టో (24 బంతుల్లో 23; 2 ఫోర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓటమిపాలైంది.  Also read: CSK vs SRH: హైదరాబాద్‌పై ధోని సేన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News