Kho Kho World Cup Winner India: భారత మహిళలు సత్తా చాటారు. తొలిసారిగా జరిగిన ఖోఖో ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ఉత్కంఠగా సాగుతుందనుకున్న పోరులో సునాయాసంగా భారత క్రీడాకారులు గెలిచారు. నేపాల్ మహిళలపై 78-40 తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. క్రికెట్‌లో అదరగొడుతున్న భారత మహిళలు ఖోఖోలో కూడా సత్తా చాటడంతో క్రీడా ప్రపంంలో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రపంచకప్ గెలుపొందిన మహిళల జట్టును దేశ ప్రముఖులు అభినందిస్తున్నారు.
ఖోఖో ప్రపంచకప్ టోర్నీకి తొలిసారి భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభమైన టోర్నీలో భారత మహిళలు ఆది నుంచి వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో నేపాల్‌తో భారత ఖోఖో క్రీడాకారులు తలపడ్డారు. 78-40 స్కోర్‌తో నేపాల్ మహిళలను భారత నారీమణులు చిత్తుగా ఓడించారు. 38 పాయింట్ల భారీ తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను భారత ఖోఖో మహిళలు కైవసం చేసుకున్నారు.
పూర్తి ఆధిపత్యం
టర్న్-1లో భారత జట్టు అత్యద్భుతంగా ఆడి డిఫెన్స్‌లో నేపాల్ అమ్మాయిల తప్పిదాలను విజయానికి మలుపులుగా భారత మహిళలు చేసుకున్నారు. తొలి టర్న్‌లో 34-0తో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇక రెండో టర్న్‌లో నేపాల్ దీటుగా ఎదుర్కొన్నప్పటికీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. రెండో టర్న్ తర్వాత 35-24గా నిలిచింది. కెప్టెన్ ప్రియాంక ఇంగిల్ అద్భుతంగా రాణించింది.
కాగా ఈ టోర్నీలో భారత ఖోఖో క్రీడాకారులు అత్యుద్భుతంగా ఆడుతూ వచ్చారు. తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న భారతదేశం ట్రోఫీని గెలుపొందడం విశేషం. ఆతిథ్యం ఇస్తూనే ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి వారిని తిరుగుముఖం పట్టించారు. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 176 పాయింట్లు సాధించి అఖండ విజయాన్ని భారత మహిళలు పొందారు.
🏆𝐊𝐇𝐎 𝐊𝐇𝐎 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒🏆||
Indian🇮🇳 Women's Team beats Nepal 78-40; Clinches the inaugural #KhoKhoWorldCup Trophy. #Finals | #KhoKhoWorldCup | #TheWorldGoesKho | #BharatvsNepal | @Kkwcindia | @Media_SAI | @YASMinistry | pic.twitter.com/mh8NJuD6RX
— All India Radio News (@airnewsalerts) January 19, 2025
👸 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 𝐦𝐚𝐝𝐞 🇮🇳🏆
Congratulations to #TeamIndia women for claiming the 𝐟𝐢𝐫𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 𝐊𝐡𝐨 𝐊𝐡𝐨 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 👏#KhoKhoWorldCup #KKWC2025 #TheWorldGoesKho #Khommunity #KhoKho #KKWCWomen pic.twitter.com/tqlBPbTIdc
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) January 19, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.