Surya Gochar 2023: గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పునే సంక్రాంతి అంటారు. మార్చి 15 ఉదయం 6.58 గంటలకు సూర్యదేవుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ 14, 2023 మధ్యాహ్నం 3.12 గంటల వరకు సూర్యుడు అదే రాశిలో సంచరిస్తాడు. దీని తర్వాత సూర్యదేవుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మీనరాశికి బృహస్పతి అధిపతి. ఆత్మ, ఉన్నత స్థానం, ప్రతిష్ట, గౌరవానికి కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. ఆదిత్యుడి సంచారం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. సూర్యుడి మీనరాశి ప్రవేశం వల్ల ఏ రాశులవారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.
సూర్యుడి సంచారంఈ రాశులకు వరం
వృషభం
వృషభరాశి యెుక్క పదకొండవ ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు. అంతేకాకుండా ఈ రాశి యెుక్క నాల్గో ఇంటికి సూర్యభగవానుడు అధిపతి. ఈరాశి వారు విశేష ప్రయోజనాలు కలుగుతాయి. పెట్టిన పెట్టుబడి మీకు లాభిస్తుంది. మీరు వాహనం లేదా ఇల్లును కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
మీ రాశిలో సూర్యుడు ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీరు ఉద్యోగంలో అనేక బెనిఫిట్స్ పొందుతారు. మీ జీతం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
కుంభరాశి యెుక్క రెండవ ఇంట్లో సూర్యుడు సంచరిస్తున్నాడు. దీంతో మీరు కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఫ్యామిలీలో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
మీనరాశి
ఈ రాశిలో సూర్యుడు లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. మెుత్తానికి మీకు కాలం కలిసి వస్తుంది.
Also Read: Shukra Gochar 2023: మేషరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook