Shiva Blessed Zodiacs: ఈ రాశులంటే శివుకుడి చాలా ఇష్టం.. శ్రావణ మాసంలో వీరికి డబ్బే డబ్బు!

Shiva Blessed Zodiacs: శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. అయితే ఈ మహా శివుడు శ్రావణ మాసంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాడు. అయితే ఈ సమయంలో శివుడి అనుగ్రహం పొందే రాశులేంటో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 27, 2024, 10:54 AM IST
Shiva Blessed Zodiacs: ఈ రాశులంటే శివుకుడి చాలా ఇష్టం.. శ్రావణ మాసంలో వీరికి డబ్బే డబ్బు!

 

Shiva Blessed Zodiacs In Telugu: శ్రావణ మాసం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో హిందూ పురాణాల ప్రకారం, మహా శివుడిని పూజించడం ఆనవాతిగా వస్తోంది. హిందువులంతా ఈ సమయంలో శివుడిని ఎంతో భక్తి శద్ధలతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ ఏడాది శ్రావణమాసంలో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ మాసాన్ని మరింత ప్రాముఖ్యత పెరిగింది. అంతేకాకుండా ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి:
శ్రావణ మాసంలో ఏర్పడే సర్వార్థ సిద్ధి యోగం కారణంగా మిథున రాశివారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. దీంతో పాటు వీరికి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ రాశివారికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయి. 

సింహ రాశి:
సింహ రాశివారికి కూడా శ్రావణ మాసంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి వ్యాపారాల్లో అనుకున్న లాభాలు కలగడమే కాకుండా మంచి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ రాశివారికి కెరీర్‌కి సంబంధించిన జీవితంలో కూడా అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వీరు శుభవార్తలు కూడా వింటారు. 

కన్య రాశి:
శ్రావణ మాసంలో కన్య రాశివారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. దీని కారణంగా వీరికి కొత్త ఉద్యోగాలు లభించడమే కాకుండా భారీగా ఆదాయ వనరులు కూడా పొందుతారు. అలాగే ఎలాంటి విజయాలైనా ఈ సమయంలో సులభంగా సాధిస్తారు. ముఖ్యంగా వీరికి అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోయే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కష్టపడి పనులు చేసేవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

తులారాశి:
శ్రావణ మాసంలోని రెండవ సోమవారం నుంచి తులారాశి వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి శివుడి అనుగ్రహం లభించి అనుకున్న పనుల్లో ఎంతో సులభంగా విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి కూడా వెంటనే విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కూడా సాధిస్తారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News