Shani Sade Sati 2023: శ‌ని స‌డే స‌తి సమయంలో ఈ 3 రాశులవారు జాగ్రత్త.. ఇందులో మీరున్నారా?

Shani dev effect: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. జాతకంలో మొదటి, రెండవ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు శని యెుక్క సడే సతి ఏర్పడుతుంది. దీని కారణంగా ఏయే రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 15, 2023, 12:22 PM IST
Shani Sade Sati 2023: శ‌ని స‌డే స‌తి సమయంలో ఈ 3 రాశులవారు జాగ్రత్త.. ఇందులో మీరున్నారా?

Shani Sade Sati 2023 effect on Zodiacs: జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. మనం చేసే కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు కాబట్టి శని గ్రహాన్ని కలియుగ న్యాయమూర్తి అంటారు. సాధారణంగా శనిదేవుడు రెండున్నరేళ్లకొకసారి తన రాశిని చేంజ్ చేస్తాడు. శని కదలికలో మార్పు కారణంగా కొందరు శని సడేసతి మరియు ధైయాను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఎవరి జాతకంలో మొదటి, రెండవ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు.. శని యొక్క సాడే సతి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఏ రాశుల వారి జాతకంలో శనీశ్వరుని సడే సతి జరుగుతోందో తెలుసుకుందాం.

ఈ రాశులవారు చాలా జాగ్రత్త
మకరరాశి- ఈ రాశికి అధిపతి శనిదేవుడు. శని సడే సతి యెుక్క చివరి దశ మకరరాశి వారిపై కొనసాగుతోంది. దీని కారణంగా మీ ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోంటారు. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. మీ పనులన్నీ ఆగిపోతాయి.
కుంభం - కుంభరాశి కూడాశని గ్రహమే అధిపతి. ప్రస్తుతం ఈ రాశి వారు శని గ్రహం యొక్క రెండో దశను ఎదుర్కొంటున్నారు. మీరు ప్రతి పనిలో ఆటంకాలను ఎదుర్కోంటారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. 
మీన రాశి - వచ్చే జూన్ వరకు మీనరాశి వారు శని సడే సతిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 

Also Read: Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశుల జాతకం మారిపోనుంది.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News